Begin typing your search above and press return to search.
హైక్ పై ఆసక్తి చూపించని 'ఎఫ్ 3' టీమ్.. మంచి నిర్ణయం
By: Tupaki Desk | 12 May 2022 9:34 AM GMTసూపర్ హిట్ ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ అన్నట్లుగా రూపొందిన ఎఫ్ 3 సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎఫ్ 3 సినిమా కోసం ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎఫ్ 2 సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఎఫ్ 3 సినిమా లో ఎంటర్ టైన్మెంట్ ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.
వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లకు అదనపు బలం అన్నట్లుగా సునీల్ కూడా వారితో ఎఫ్ 3 లో జత కలిశాడు. తప్పకుండా ఎఫ్ 3 సినిమా ఆడియన్స్ కోరుకున్నంత ఫన్ ను... ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే డబుల్ ఎంటర్ టైన్మెంట్ ను ఇస్తుందని మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా కరోనా వల్ల కాస్త ఆలస్యం అయినా కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పెద్ద సినిమాలకు.. భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి వారం లేదా పది రోజుల పాటు టికెట్ల రేట్లను పెంచుకునే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వెసులుబాటును కలిగిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉంటే కాస్త చిన్న సినిమాలకు.. మీడియం బడ్జెట్ సినిమాలకు కూడా టికెట్ల రేట్ల హైక్ ఛాన్స్ ఉంది. కాని ఎఫ్ 3 మాత్రం ఆ హైక్ ను కోరుకోవడం లేదట.
ఇప్పటికే టికెట్ల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం విమర్శలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో టికెట్ల రేట్లను మరింతగా పెంచడం అనేది ఏమాత్రం కరెక్ట్ నిర్ణయం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈమద్య కాలంలో విడుదల అయిన సినిమాల టికెట్ల రేట్లు భారీగా ఉండటం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అయ్యింది అనేది కొందరి అభిప్రాయం.
అందుకే ఎఫ్ 3 సినిమా కోసం దిల్ రాజు భారీగానే ఖర్చు చేశాడు. అయినా కూడా టికెట్ల రేట్లను పెంచే ఉద్దేశ్యం లేదని తెలుస్తుంది. ఎఫ్ 3 సినిమా ను మెయిన్ గా ఫ్యామిలీ ఆడియన్స్ చూడాలని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. అందుకే సినిమా టికెట్ల రేట్లను పెంచడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అయ్యే అవకాశం ఉంది. అందుకే ఆ నిర్ణయాన్ని దిల్ రాజు తీసుకోవడం లేదు.
ఈ విషయమై సినీ ప్రేమికులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా మంచి నిర్ణయం అనే స్పందన తెలియజేస్తున్నారు. వెంకటేష్.. వరుణ్ తేజ్ కలిసి నటించిన ఎఫ్ 3 సినిమా లో తమన్నా మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించారు. రాజేంద్ర ప్రసాద్.. సునీల్.. వెన్నెల కిషోర్ లు కీలక పాత్రలో నటించారు. ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.