Begin typing your search above and press return to search.

'ఎఫ్ 3' ట్రిపుల్ బ్లాక్ బ‌స్ట‌ర్.. 4 రోజుల్లోనే 32.11 కోట్ల షేర్!

By:  Tupaki Desk   |   31 May 2022 8:25 AM GMT
ఎఫ్ 3 ట్రిపుల్ బ్లాక్ బ‌స్ట‌ర్.. 4 రోజుల్లోనే 32.11 కోట్ల షేర్!
X
`ఎఫ్-3` బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌య దుందుబీ మోగిస్తోంది. స‌మ్మ‌ర్ సోగ్గాళ్లు బాక్సాఫీస్ ని వ‌సూళ్ల‌తో చేస్తున్నారు. నాల్గ‌వ రోజు కూడా సినిమా భారీ షేర్ తెచ్చింది. నాలుగు రోజుల్లోనే 32.11 కోట్ల షేర్ తో `ఎఫ్-3` బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటింది. తెలుగు రాష్ర్టాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లోనూ `ఎఫ్ -3` కి ఎదురులేద‌ని తెలుస్తోంది.

తాజాగా నాల్గ‌వ రోజు షేర్ వ‌సూళ్ల‌ని చిత్ర నిర్మాత‌లు రివీల్ చేసారు. ``నైజాం-2.3 కోట్లు.. గుంటూరు 0.32 కోట్లు.. వెస్ట్ 0.20 కోట్లు.. ఈస్ట్ 0.34 కోట్లు..నెల్లూరు 0.14 కోట్లు..కృష్ణా 0.28 కోట్లు..సీడెడ్ 0.71 కోట్లు..యూఏ 0.66 కోట్ల‌ వ‌సూళ్ల‌ని సాధించింది. నాల్గ‌వ రోజు ఏపీ-తెలంగాణ రాష్ర్టాల్లో షూర్ 4.64 కోట్లు. మొత్తం నాలుగు రోజుల షేర్ 32.11 కోట్లు తెచ్చిన‌ట్లు నిర్మాత‌లు తెలిపారు.

దీంతో మొద‌టి వారంతంలోనే సినిమా అనూహ్య ఫ‌లితాలు సాధించిందని తెలుస్తోంది. ఓవ‌ర్సీస్ లో `ఎఫ్-3` నాలుగు రోజుల్లోనే 1 మిలియ‌న్ డాల‌ర్ మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో `ఎఫ్ 3` అరుదైన వ‌సూళ్ల చిత్రాల స‌ర‌స‌న నిలిచింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు`..`ఎఫ్ -2` త‌ర్వాత అనీల్ కి మూడ‌వ మిలియ‌న్ డాల‌ర్ చిత్రంగా నిలిచింది.

నాల్గ‌వ రోజు సోమ‌వారం సినిమా ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌ని యూనిట్ లో చిన్న టెన్ష‌న్ క‌నిపించింది. నాల్గ‌వ రోజు లిట్మ‌స్ టెస్ట్ ప‌రీక్ష‌లో పాస్ అవుతుందా? లేదా? అన్న‌ సందేహాలు వ్య‌క్త‌మైన‌ప్ప‌టికీ వాట‌న్నింటిని బ్రేక్ చేస్తూ ఎఫ్ 3 ట్రిపుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. తొలి మూడు రోజుల వేవ్ నే నాల్గ‌వ రోజు కూడా యాధావిధిగా కొన‌సాగించింది.

దీంతో అన్ని ఏరియాల్లో `ఎఫ్ -3` దూకుడులో ఏమాత్రం ఛేంజ్ లేద‌ని తెలుస్తోంది. సినిమా బ్రేక్ ఈవెన్ కి చేరువ‌లోనే ఉన్న‌ట్లు తెలుస్తోంది. మ‌రో రెండు రోజుల్లోనే సునాయాసంగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుంద‌ని ట్రేడ్ భావిస్తోంది. విక్ట‌రీ వెంక‌టేష్‌..మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ పెర్పార్మెన్స్ కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు.

అనీల్ రావిపూడి మార్క్ చిత్రంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. అనీల్ మార్క్ కామెడీ మ‌రోసారి ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బా న‌వ్విస్తుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పై దిల్ రాజు-శిరీష్ నిర్మించారు.