Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ ని వాడేస్తున్న టాలీవుడ్
By: Tupaki Desk | 12 Jan 2017 5:28 PM GMTసోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ అనే విషయం మాటల్లో చెప్పాల్సిన పని లేదు. అందుకే సినిమా వాళ్లు కూడా ముందు ఆన్ లైన్ ప్రచారం మీదే దృష్టి పెట్టేస్తున్నారు. జనాలు ఇంట్లో కంటే నెట్లో ఎక్కువ బతికేస్తున్న ఈ రోజుల్లో ఫేస్ బుక్.. ట్విట్టర్ లాంటివి జీవితాల్లో భాగం అయిపోయాయి. అందుకే.. సినిమా జనాలు కూడా వీటిని తెగ ఉపయోగించేసుకుంటున్నారు.
హైద్రాబాద్ లో ఫేస్ బుక్ ఆఫీస్.. ఇప్పుడు టాలీవుడ్ కి పబ్లిసిటీ జంక్షన్ కానుందా అనిపించక మానదు. ఫేస్ బుక్ నుంచి లైవ్ లు.. లైవ్ ఛాట్ లు అందరికీ ముందే తెలుసు కానీ.. ఏకంగా ఫేస్ బుక్ ఆఫీస్ నుంచి అక్కడి భామలతో లైవ్ షో చేశాడు ఖైదీ నంబర్ 150 ప్రొడ్యూసర్ రామ్ చరణ్. పబ్లిసిటీలో మెగా పవర్ స్టార్ చూపించిన ఈ కొత్త స్ట్రాటజీ ఇప్పుడు టాలీవుడ్ కి తెగ నచ్చేసింది. అందుకే ఈ కాన్సెప్ట్ ను అందిపుచ్చుకునేందుకు వరుసగా క్యూ కట్టేస్తున్నారు.
ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి కోసం కూడా హైద్రాబాద్ లోని ఫేస్ బుక్ కార్యాలయం నుంచి ప్రచారం చేస్తున్నారు. తాజాగా దర్శకుడు క్రిష్.. హీరోయిన్ శ్రియా శరణ్ లు.. చరణ్ ఖైదీని ప్రమోట్ చేసిన అదే ప్లేస్ నుంచి లైవ్ షో ద్వారా.. శాతకర్ణికి ప్రచారం నిర్వహించారు. రిలీజ్ ల విషయంలోనే కాదు.. ప్రచారం విషయంలో చిరు-బాలయ్యల సినిమాల ఏ రేంజ్ లో పోటీ పడుతున్నాయో చెప్పడానికి ఫేస్ బుక్ ఆఫీస్ కేంద్రం అయిపోతోంది. త్వరలో మరిన్ని సినిమాలు ఇదే స్ట్రాటజీని ఫాలో కాబోతున్నాయి.