Begin typing your search above and press return to search.
సెకండ్ వేవ్ ని ఎదురిస్తే టాలీవుడ్ కి మంచి రోజులే
By: Tupaki Desk | 19 April 2021 12:30 AM GMTకోవిడ్ -19 సెకండ్ వేవ్ ఇప్పటికే టాలీవుడ్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఆన్ లొకేషన్ ఆర్టిస్టులు సిబ్బంది కోవిడ్ భారిన పడుతుండడం కలకలం రేపుతోంది. పర్యవసానంగా అనేక సినిమాల షూటింగులు వాయిదా పడ్డాయి. సెట్స్ లో ఉన్నవారంతా ఇప్పటికి కఠినమైన కోవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరిస్తూ షూటింగ్ లు చేస్తున్నారు.
ప్రతిరోజూ తెలంగాణలో 5000 కు ఆంధ్రప్రదేశ్‌లో 7500 కు పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున థియేటర్ల రంగంపైనా ఆ ప్రభావం చూపిస్తోంది. దీంతో మునుపటిలానే సినిమా హాళ్లలో 50 శాతానికి ఆక్యుపెన్సీ తగ్గించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా అనేక పెద్ద బడ్జెట్ చిత్రాల థియేట్రికల్ విడుదల తేదీల్ని వాయిదా వేశారు.
కోవిడ్ -19 రెండవ వేవ్ తీవ్రత వైద్య-ఆరోగ్య వ్యవస్థపైనా భారీ ప్రభావాన్ని చూపుతోంది. ప్రజలే తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని అందుకోసం జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా మాస్క్ లు ధరించాలని అన్ని సమయాల్లో సామాజిక దూరాన్ని ఆచరించాలని ప్రజలను హెచ్చరిస్తున్నారు.
దేశంలో రోజువారీ కేసులు రోజుకు 3 లక్షలు తాకినట్లు భావిస్తున్నారు. ఉత్తరాది-దక్షిణాది రెండు చోట్లా ఇబ్బందికరంగానే ఉంది. దీంతో ప్రజలు పెద్ద సంఖ్యలో సినిమా హాళ్ళకు తిరిగి రావడానికి కొంత సమయం పడుతుంది. అనేక చలన చిత్ర నిర్మాణ సంస్థలు కళాకారుల తేదీల లభ్యత ప్రయాణ పరిమితులను బట్టి షూటింగుల్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. చాలా వాటిని రీషెడ్యూలింగ్ చేస్తున్నారు.
ఇవన్నీ ప్రాజెక్టుల వేగాన్ని తగ్గిస్తున్నాయి. థియేటర్ వ్యాపారంపై ప్రతిబింబిస్తున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి సాధారణ స్థితికి చేరుకున్నా ఆ తర్వాత విడుదల తేదీలను ఖరారు చేయడం పెద్ద పని అవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ త్వరలోనే కోలుకుంటుందని ఆశిద్దాం. కోవిడ్ మహమ్మారీని తరిమికొట్టే వారియర్స్ గా ప్రజలంతా మారాలి. పరిశ్రమల్ని నిలబెట్టాలంటే ప్రజల జాగ్రత్త చాలా ముఖ్యం.