Begin typing your search above and press return to search.

జైలవకుశ లో నవ్వించేది రావణుడేనట!

By:  Tupaki Desk   |   11 Sept 2017 11:47 AM IST
జైలవకుశ లో నవ్వించేది రావణుడేనట!
X
జైలవకుశ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కాస్త ఎమోషనల్ గా మాట్లాడి ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకున్న యన్టీఆర్ మరోవైపున మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ రప్పించడానికి భారీ స్కెచ్ గీసినట్లుగా తెలిసింది. ఈ ఫంక్షన్ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ లో అలానే రావణ అనే క్యారెక్టర్ టీజర్ లో జనాలకి చూపించిన యన్టీఆర్ నిజానికి సినిమాలో అలా నెగిటివ్ షెడ్స్ లో ఉండదంట. ఈ క్యారెక్టర్ ఫుల్ లెంత్ కామెడీగా సాగిపోతుందని సమాచారం. అయితే ఈ విషయాన్ని దాచి, ఇదో నెగిటివ్ క్యారెక్టర్ అనే రీతిన ప్రచారం చేస్తున్నారట డైరెక్టర్ బాబీ అండ్ టీమ్.

జై అనే క్యారెక్టర్ కు నాటకాలంటే ఇష్టం - చిన్నప్పుడే తన అన్నదమ్ముదల దగ్గర నుంచి వేరు పడిన జై నాటకాల గ్రూప్ లో చేరతాడు. రామాయణంలో రావణుడు పాత్రని పండించడంలో జై ఆరితేరిపోవడంతో నాటకాల బృందం ప్రతి సారి జై కే ఆ క్యారెక్టర్ ఇస్తుంది. ఈ క్రమంలో తన ఇద్దరి అన్మదమ్ముల్ని జై కలుసుకోవడం - ఒకరి స్థానాల్లోకి మరొకరు వెళ్లి తమకొచ్చిన సమస్యల్ని నుంచి బయటపడటంతో జైలవకుశ కథ నడుస్తుందని ఇన్ సైడ్ టాక్. ప్రచారంలో సీరియస్ ఫీల్ ఇస్తూ రేపు థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడ్ని ఒక్కసారిగే నవ్వించాలనుకునే ట్రిక్ బాగానే ఉంది కానీ ఇది వర్క్ అవుట్ అవ్వకపోతే సినిమా బోల్తాపడే అవకాశాలు కూడా ఎక్కువే. మరి ఈ విషయంలో ఆడియెన్స్ యన్టీఆర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.