Begin typing your search above and press return to search.
స్పైడర్ మోషన్ పోస్టర్ ప్రత్యేకత అదీ..
By: Tupaki Desk | 13 April 2017 6:26 AM GMTలేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు మహేష్ బాబు. ఇప్పటిదాకా మనం చూసిన మోషన్ పోస్టర్లకు భిన్నంగా ఉంది ‘స్పైడర్’ పోస్టర్. ఈ మోషన్ పోస్టర్ వీడియో చూసిన వాళ్లందరూ ఆ తేడాను గమనించే ఉంటారు. ఇప్పటిదాకా మోషన్ పోస్టర్ అంటే ఒక రకంగా ఉండేది. పోస్టర్లోని దృశ్యాల్ని విడగొట్టి.. అవి ఒక్కొక్కటిగా స్క్రీన్ మీదికి వస్తున్నట్లుగా అనిపించేది. కానీ ‘స్పైడర్’ మోషన్ పోస్టర్ ఆ తరహాది కాదు.
ఇది డిజిటల్ మోషన్ పోస్టర్. శూన్యం నుంచి మహేష్ రూపం ఫామ్ అయిన తీరు చూస్తే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఇక్కడే మురుగదాస్ ముద్ర ఏంటన్నది స్పష్టంగా కనిపించింది. ఈ సినిమా స్టాండర్డ్స్ ఏంటన్నది ఈ మోషన్ పోస్టర్ రుజువు చేసింది. క్వాలిటీ విషయంలో రాజీ పడని మురుగదాస్ స్టైల్ గురించి మరోసారి అందరికీ అర్థమైంది. ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇలాగే స్పెషల్ గా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక ‘స్పైడర్’ అనే టైటిల్.. దాన్ని డిజైన్ చేసిన తీరు కూడా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. టైటిల్ లోగో డిజైన్ విషయంలో హాలీవుడ్ మూవీ ‘పాసింజర్స్’ ఛాయలు కొంచెం కనిపిస్తున్నప్పటికీ.. పోస్టర్ కు తగ్గట్లే చాలా స్టైలిష్ గా ఉందంటూ టైటిల్ లోగో మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంగ్లిష్ టైటిల్ అన్న అభ్యంతరం పక్కనబెడితే ఓవరాల్ గా ఈ పేరుకు మంచి స్పందనే వస్తోంది. ఐతే తమిళంలో ఈ సినిమాకు ఇదే పేరు పెడతారో.. లేక మారుస్తారా అన్నది చూడాలి. అక్కడ సినిమాలకు తమిళ టైటిల్ పెడితే పన్ను మినహాయింపు వస్తుందన్న సంగతి తెలిసిందే.