Begin typing your search above and press return to search.
నరసింహానాయుడు కథ వెనక కథ
By: Tupaki Desk | 13 Sep 2015 7:30 PM GMTబాలకృష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వం వహించిన నరసింహానాయుడు బ్లాక్ బస్టర్ హిట్. నందమూరి అభిమానుల్ని, తెలుగు ప్రేక్షకలోకాన్ని గొప్పగా ఆకట్టుకున్న చిత్రమిది. అయితే ఈ సినిమా మేకింగ్ వెనక బోలెడంత కథ ఉంది. ఆ కథ వింటే ఆశ్చర్యం కలిగించే విషయాలెన్న. అసలు ఈ సినిమాకి చిన్ని కృష్ణ కథారచయిత కాదు. మొదట పోసాని కృష్ణ మురళి కథ తెచ్చారు. ముహూర్తపు సీన్ ఆ కథతోనే తీశారు. కానీ బి.గోపాల్ ఎందుకనో ఆ కథతో సంతృప్తి చెందలేదు. అందుకే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. కట్ చేస్తే పరుచూరి సోదరులు తమ ఆస్థాన కథారచయిత, శిష్యుడు అయిన చిన్నికృష్ణని రంగంలోకి దించారు.
బాలయ్యబాబుకు లారీ డ్రైవర్ - రౌడీ ఇన్ స్పెక్టర్ - సమర సింహారెడ్డి ని మించిన కథ కావాలి. హిట్టు కావాలి.. అని అడిగారు. అంతే స్పాట్ లోనే చిన్ని కృష్ణ కథ చెప్పడం మొదలెట్టేశారు. పోసాని, విజయేంద్ర ప్రసాద్, ఆంజనేయ పుష్పానంద్, ఈరోడ్ సౌందర్ ఇంతమంది దిగ్గజాలు ఈ సినిమా కో్సం ఒక్కో కథ రాసుకున్నారు. కానీ వీళ్లెవ్వరికీ పనవ్వలేదు. చిన్నికృష్ణ చెప్పిన కథనే గోపాల్ ఓకే చేశారు. బాలయ్య సమరసింహారెడ్డి - రజనీకాంత్ నరసింహా సినిమాలకు కథా రచయితగా పనిచేయడం చిన్నికృష్ణకు కలిసొచ్చింది. అనూహ్యంగా అతడిని స్టార్ రైటర్ ని చేసేశారంతే. వాస్తవానికి ఈ సినిమాలో బాలయ్యబాబు ఆజ్ఞాతంలో ఉండే సీబీఐ ఆఫీసర్ గా కనిపించాలి. కానీ దానిని బి.గోపాల్ చిన్నితో కలిసి ఓ సంగీత నాట్యాచారుడిగా మార్చేశారు. ఆ ఒక్క మార్పుతోనే బాలయ్యబాబు నాట్యం కూడా నేర్చుకోవాల్సొచ్చింది. శ్రావణి పాత్రకు సౌందర్య - అంజలి పాత్రకు సిమ్రన్ ఎంపికయ్యారు. తీరా చూస్తే సౌందర్య కాల్షీట్లు దొరకలేదు. దాంతో శ్రావణి పాత్రకు సిమ్రన్ ని మార్చారు. అంజలి పాత్రలో ప్రీతి జింగానియాని తీసుకున్నారు. అలా సెట్స్ కెళ్లిన సినిమాలో పరుచూరి వారు రాసిన డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టరే.
ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. టైమ్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా సరే.. ఎప్పుడైనా సరే.. ఎక్కడైనా సరే.. కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా.. ! ఇదీ డైలాగ్. గోపాలకృష్ణ రాసిన ఈ డైలాగ్ ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. నందమూరి అభిమానుల్ని ఓ రేంజులో ఖుషీ చేసిన డైలాగ్ ఇది. సమరసింహారెడ్డి లానే మరో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందీ చిత్రం