Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కూడా నరికేయడమే!!
By: Tupaki Desk | 5 April 2017 4:28 PM GMTఓ సినిమాకి లుక్స్ రిలీజ్ చేయడంలో.. దాని థీమ్ ని చెప్పీ చెప్పకుండా ఉండాలని చూస్తుంటారు మేకర్స్. శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా.. ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జై లవ కుశ లోగో లుక్ రిలీజ్ అయింది. షూటింగ్ మొదలుపెట్టి నాలుగు వారాలు కూడా పూర్తి కాకుండా.. అప్పుడే టైటిల్ డిసైడ్ చేయడమే కాదు.. లోగో లుక్ కూడా డిజైన్ చేసి రిలీజ్ చేసినందుకు అభినందించాల్సిందే.
అయితే.. క్లోజ్ గా పరిశీలిస్తే.. ఈ లోగో లుక్ వీడియోలోనే సినిమా థీమ్ చెప్పే ప్రయత్నం చేశారు సినిమా యూనిట్. దేవుడైన రాముడి పేరు మీద.. రావణుడి లాంటి విలన్స్ ను అంతమొందించడమే అనే విషయం అర్ధం చేసుకోవచ్చు. కమర్షియల్ సినిమాలు ఏవైనా సరే ఇదే థీమ్ తో ఉంటాయి. ఇంతకంటే ఎక్కువగా తెలుగు సినిమా నుంచి ఎక్స్ పెక్ట్ చేయడం కొంచెం కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే.. కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో.. రౌడీలను.. విలన్స్ ను ఇష్టం వచ్చినట్లు హీరో నరికేయడమే ప్రతీ మూవీలో థీమ్ అవుతోంది.
ఇందులో ఇసుమంతైనే రియాలిటీ లేదనే విషయం తెలిసినా.. ఫ్యాన్స్ అవే అడుగుతున్నారు కాబట్టి.. తాము అవే చేస్తున్నామంటున్నారు హీరోలు. స్టార్లు కోరుకుంటున్నవే రాస్తున్నామని చెబుతున్నారు రైటర్లు. ఇలాంటి వాస్తవదూర విషయాలపై కాకుండా.. వాస్తవాలకు దగ్గరగా సినిమాలు ఎక్కువగా వచ్చే కాలం టాలీవుడ్ లో ఎప్పుడు వస్తుందో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/