Begin typing your search above and press return to search.
స్కూల్‌కు వెళ్లే రోజుల్లోనే డ్రగ్స్ తీసుకున్న టాప్ హీరో
By: Tupaki Desk | 30 July 2017 6:12 AM GMTగడిచిన కొద్దికాలంగా డ్రగ్స్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. స్కూల్ పిల్లల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ హైదరాబాద్ మహానగరంలో మొత్తంగా వ్యాపించిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు భారీ కలకలాన్నే రేపుతోంది. ఇదిలా ఉంటే.. డ్రగ్స్ మత్తులో టాలీవుడ్ ఇంతగా జోగుతుందా? అన్న సందేహం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అయితే.. డ్రగ్స్‌కు సినిమా రంగానికి మధ్య సంబంధం ఇప్పటిది కాదని చెప్పేవారు. డ్రగ్స్ ముచ్చట ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారిన వేళ.. టాప్ హీరోకు సంబంధించిన డ్రగ్స్ లింకుపై ఇప్పుడు పలువురు ప్రస్తావిస్తున్నారు.
బాలీవుడ్ హీరోల్లో అగ్రనటుడిగా ఎదిగినప్పటికీ తన తీరుతో పలు వివాదాల్లో కూరుకుపోయిన నటుడు సంజయ్ దత్. ఒకప్పుడు హాట్ హీరోగా పేరున్న సంజయ్ దత్ చిన్నప్పటి నుంచి వివాదాస్పద అంశాల్లో ఆయన పేరు వినిపిస్తూ ఉండేది.
ప్రస్తుతం 58 ఏళ్ల సంజయ్.. 22 ఏళ్ల వయసులో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. 1981లో ఆయన నటించిన రాకీ మూవీతో హీరోగా ఎంటర్ అయిన సంజయ్.. వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాస్పదంగా ఉండేది. స్కూల్‌కు వెళ్లే రోజుల్లోనే సంజయ్ డ్రగ్స్ తీసుకునేవాడని చెబుతారు. 1981లో తన తల్లి.. ప్రముఖ నటి నర్గీస్ చనిపోయిన తర్వాత సంజయ్ డ్రగ్స్‌కు మరింతగా అలవాటు పడ్డాడని చెబుతారు. 1982లో డ్రగ్స్ కలిగి ఉన్నాడన్న నేరం మీద ఐదు నెలలు జైలుశిక్ష అనుభవించాడు సంజయ్. ఈనేపథ్యంలో సినీ నటుడు కమ్ పొలిటీషియన్ అయిన సునీల్ దత్.. తన కొడుకును డ్రగ్స్ మహమ్మారి నుంచి తప్పించేందుకు యూఎస్ కు పంపి మరీ ప్రత్యేకంగా చికిత్స చేయించారు. మూడేళ్ల తర్వాత తిరిగి 1985లో జాన్ కీ బాజీ చిత్రంలో నటించటం ద్వారా సినిమాల్లో తన ప్రయాణాన్ని మళ్లీ షురూ చేశారు.
ఇదిలా ఉంటే.. 1993లో ముంబయి సీరియల్ బాంబు దాడుల కేసులో సంజయ్ .. చట్టవిరుద్ధంగా మారణాయుధాలు కలిగి ఉన్నట్లుగా కోర్టు గుర్తించింది. ప్రత్యేక టాడా కోర్టు సంజయ్ కు 2007లో ఆరేళ్లపాటు జైలుశిక్షను విధించారు. అయితే.. 2013లో సుప్రీంకోర్టు ఈ శిక్షను ఐదేళ్లకు తగ్గించింది. అనంతరం 2013 మే 21న సంజయ్‌ను ఫూణెలోని ఎరవాడ జైలుకు తరలించారు.
జైల్లో సంజయ్ తీరు బాగుండటంతో శిక్షా కాలం ముగియటానికి 103 రోజుల ముందే ఆయన్ను విడుదల చేయటం అప్పట్లో సంచలనం మారింది. ఇదిలా ఉంటే.. సంజయ్ వైవాహిక జీవితానికి వస్తే తొలిగా రుచాశర్మను పెళ్లి చేసుకున్నారు. ఆమె బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు. రెండోపెళ్లిగా రియా పిళ్లయ్‌ని.. మూడో పెళ్లిగా మాన్యతను వివాహమాడారు. సంజయ్‌కు త్రిశాల్.. ఇక్రా అనే ఇద్దరు కుమార్తెలు.. షహరాన్ అనే కుమారుడు ఉన్నాడు. త్రిశాల్ రిచా శర్మకు పుట్టగా.. మాన్యత బిడ్డగా ఇక్రా.