Begin typing your search above and press return to search.
వెంకీ 'గురు' వెనుక సీక్రెట అదేనా..
By: Tupaki Desk | 20 Sep 2016 7:30 AM GMTగత నెలలో బాబు బంగారం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ వెంకటేష్.. తన కొత్త సినిమా గురు షూటింగ్ మొదలుపెట్టేశాడు. గురు అనే టైటిల్ పై.. బాలీవుడ్ మూవీ సాలా ఖద్దూస్ ని రీమేక్ చేస్తుండగా.. సెప్టెంబర్ 19న ఈ సినిమా షూటింగ్ మొదలైంది. బాక్సింగ్ గేమ్ పై.. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం.. వెంకీ కెరీర్ లో 'స్పెషల్'గా నిలిచిపోతుందని అంటున్నారు.
అఫీషియల్ గా సెప్టెంబర్ 19న గురు షూటింగ్ మొదలు కాగా.. డిసెంబర్ 23న రిలీజ్ అంటూ అనఫీషియల్ సమాచారం ఉంది. ఇదే ఆశ్చర్యపోవాల్సిన విషయంగా కనిపిస్తోంది. కేవలం 90 రోజుల్లోనే ఓ సినిమాను రిలీజ్ కి ఎలా రెడీ చేస్తారన్నదే పాయింట్. దీనికి ఓ సమాధానం కూడా వినిపిస్తోంది. వెంకీ హీరోగా రీమేక్ అవుతున్న ఈ సినిమాలో.. వెంకటేష్ మినహాయిస్తే.. మిగిలిన అందరూ ఒరిజినల్ లో నటించినవారే ఉంటారనే విషయం ఇప్పటికే అనౌన్స్ చేసేశారు. ఇందులోనే అసలు సీక్రెట్ ఉందట.
వెంకటేష్.. వెంకీ-రితికా సింగ్ ల కాంబినేషన్ లో వచ్చే సీన్స్ మినహాయిస్తే.. మిగిలినవన్నీ ఒరిజినల్ నుంచే తీసుకుంటుందట గురు యూనిట్. అందుకే మూడు నెలల్లోనే విడుదల చేసేయాలనే టార్గెట్ పెట్టేసుకున్నారట. అదే నిజమైతే కనుక ఇప్పటికే సగం సినిమా రెడీగా ఉన్నట్లే. మిగిలిన సగం మూవీని పిక్చరైజ్ చేసి.. పాత వెర్షన్ కు కొత్తగా డబ్బింగ్ చెప్పించేస్తే సరిపోతుంది. ఇలా హాఫ్ డబ్బింగ్.. హాఫ్ రీమేక్ చేసేసే కాన్సెప్ట్ ఏదో కొత్తగా అనిపించడం లేదూ!