Begin typing your search above and press return to search.
నేచురల్ స్టార్ ''మాలిక్'' ఎలా ఉందంటే..!
By: Tupaki Desk | 15 July 2021 1:30 PM GMTకరోనా నేపథ్యంలో థియేటర్లు మూతబడి ఉండటంతో సినిమాలన్నీ ఓటీటీ వేదికలలో రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో ఇప్పుడు పెద్ద సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి కానీ.. మలయాళ హిందీ భాషల్లో ఎప్పటి నుంచో క్రేజీ మూవీస్ డిజిటల్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే 'సి యూ సూన్' 'ఇరుల్' 'జోజి' వంటి చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేసిన మలయాళ విలక్షణ నటుడు ఫహాద్ ఫాజిల్.. తాజాగా ''మాలిక్'' అనే మరో చిత్రానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ చిత్రం గురువారం రాత్రి 10 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
'మాలిక్' ట్రైలర్ తోనే ఫహాద్ ఫాజిల్ మరోసారి తన పెర్ఫార్మన్స్ తో మరోసారి మెస్మరైజ్ చేయబోతున్నారని అర్థం అయింది. సినిమా రిలీజ్ అయ్యాక మలయాళం నుంచి మరో మంచి మూవీ వచ్చిందని కామెంట్స్ వస్తున్నాయి. సినీ విమర్శకులు సైతం ఏ ఏడాది వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఇదొకటి అని రివ్యూస్ ఇచ్చారు. 'ట్రాన్స్' 'అనుకోని అతిథి' వంటి సినిమాలలో ఫహాద్ యాక్టింగ్ కి ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు.. సబ్ టైటిల్స్ తో 'మాలిక్' సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.
కొన్ని దశాబ్దాలపాటు అణచివేతకు గురి అవుతున్న తన సామాజిక వర్గ ప్రజలను కాపాడుకుంటూ ఉద్యమనేతగా ఎదిగిన సులేమాన్.. ఓ పెద్ద డాన్ గా ఎలా అయ్యాడు.. ఈ క్రమంలో అతను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే కథాంశంతో 'మాలిక్' సినిమా రూపొందింది. 'గాడ్ ఫాదర్' 'నాయకుడు' 'వన్స్ అపాన్ ఎ టైం ఇన్ అమెరికా' వంటి సినిమాల తరహాలోనే ఈ పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందని ఆడియన్స్ చెబుతున్నారు.
ప్రయోగాత్మక చిత్రాల్లో తనదైన విలక్షణ నటనతో క్రేజీ స్టార్ గా మారిపోయిన ఫహాద్.. మరోసారి 'మాలిక్' లో తన నటనతో ఆకట్టుకున్నారని తెలుస్తోంది. విభిన్నమైన షేడ్స్ - లుక్స్ లో కనిపించడమే కాకుండా.. కొన్ని చోట్ల అగ్రెసివ్ గా మరికొన్ని చోట తన మెచ్యూర్డ్ యాక్టింగ్ తో కట్టిపడేశారని అంటున్నారు. హీరోయిన్ నిమిషా సజయన్ కూడా కొన్ని సన్నివేశాల్లో ఫాహాద్ కు పోటీగా నటించిందని చెబుతున్నారు.
ఫహద్ తో 'టేకాఫ్' 'సీ యూ సూన్' వంటి సినిమాలు రూపొందించిన దర్శకుడు మహేష్ నారాయణన్.. ''మాలిక్'' చిత్రాన్ని తెరకెక్కించారు. గ్యాంగ్ స్టర్ డ్రామాల స్ఫూర్తితో రాసుకున్న కథతో ప్రేక్షకులను మెప్పించారు మహేష్. ఈ చిత్రంలో జోజు జార్జ్ - వినయ్ ఫోర్ట్ - జలజా - దిలీష్ పోథన్ - దినేష్ ప్రభాకరన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చగా.. సను జాన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆంటో జోసెఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.