Begin typing your search above and press return to search.
#పుష్ఫ.. బన్ని విలన్ గా జాతీయ అవార్డ్ గ్రహీత!
By: Tupaki Desk | 21 March 2021 4:44 AM GMTకొన్ని అవకాశాలు అరుదుగానే వస్తుంటాయి. అలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఆ తర్వాత కెరీర్ పరంగా ఎదురే ఉండదు. అందుకు రంగుల ప్రపంచంలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అదే తీరుగా ట్యాలెంటెడ్ మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ని అద్భుత అవకాశం వెతుక్కుంటూ వచ్చింది.
తాజాగా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప చిత్రంలో జాతీయ అవార్డ్ గ్రహీత ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించింది. ఫహద్ కి ఇది రేర్ ఛాయిస్ అనే చెప్పాలి. గంధపు చక్కల స్మగ్లింగ్ అనే యూనివర్శల్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో విలన్ గా అవకాశం అంటే హీరోకి విలన్ కి మధ్య భీకర పోరు ఓ రేంజులో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మైండ్ గేమ్ నేపథ్యంలో ఎలివేషన్ కి ఆస్కారం ఉన్న సన్నివేశాల్లో ఫహద్ తనని తాను ఎలివేట్ చేసుకునేందుకు లేదా నిరూపించుకునేందుకు చాలా స్కోప్ ఉంటుంది. ఇక యథావిధిగానే లెక్కల మాస్టార్ సుకుమార్ విలన్ పాత్రకు ఇచ్చే ప్రాధాన్యత కూడా ఆ రేంజులోనే ఉంటుంది. పుష్పలో బన్ని వర్సెస్ ఫహద్ సీన్స్ గగుర్పొడిచే రేంజులో ఉంటాయనే అభిమానులు వేచి చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిజానికి ఈ పాత్రలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాల్సింది. వైష్ణవ్ తేజ్ ఉప్పెన తో పాటు పుష్పలో నటించేందుకు ఆయన అంగీకరించారు. ఆ క్రమంలోనే అతడి పేరు చాలా కాలంగా ప్రపోజల్స్ లో ఉన్నా కానీ చివరికి ఇతర సినిమాల షెడ్యూల్స్ కారణంగా వైదొలగాల్సి వచ్చింది. సేతుపతి వైదొలిగాక మలయాళ హ్యాండ్సమ్ హీరో ఫహద్ ఫాజిల్ ని ఈ అరుదైన అవకాశం వరించింది.
ఫహద్ ఇప్పటికే మాలీవుడ్ లో పెద్ద హీరో. ట్రాన్స్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో అద్భుత నటనతో కట్టిపడేసిన ఫహద్ కెరీర్ పరంగా మాంచి ఊపులో ఉన్నారు. ఇప్పుడు బన్ని సినిమాలో అవకాశం దక్కడంతో అతడు ఇటు టాలీవుడ్ లోనూ పాపులారిటీ పెంచుకోనున్నాడు.
ఇటీవల పాన్ ఇండియా మార్కెట్ కోరుకుంటున్న హీరోలకు ఇలా బహుభాషల్లో వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం చాలా అవసరం. ఇకపై ఫహద్ ఫాజిల్ నటించిన అనువాద చిత్రాలకు ఇక్కడ డిమాండ్ పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
వీడియో కోసం క్లిక్ చేయండి