Begin typing your search above and press return to search.

అమీర్ ఖాన్ సినిమాపై సోద‌రుడు విమ‌ర్శ‌లు!

By:  Tupaki Desk   |   21 Sep 2022 6:16 AM
అమీర్ ఖాన్ సినిమాపై సోద‌రుడు విమ‌ర్శ‌లు!
X
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' ఇటీవ‌ల విడుద‌లై పరాజ‌యం చెందిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా నిర్మాత‌ల‌కు తీవ్ర న‌ష్టాల్ని మిగిల్చింది. ఈ సినిమాకి అమీర్ ఖాన్ స‌హ- నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రించి న‌ష్ట‌పోయారు. గతంలో ఏ సినిమాకి రాన‌న్ని న‌ష్టాలు లాల్ సింగ్ చ‌డ్డాకి రావ‌డం విశేషం.

దీంతో అమీర్ సైతం ప‌రాజ‌యానికి గ‌ల కార‌ణాల్ని రివీల్ చేసారు. బాలీవుడ్ లో ఉన్న బాయ్ కాట్ ట్రెండ్..నెగిటివ్ ప‌బ్లిసిటీ..ఫేక్ రివ్యూలు కార‌ణ‌మ‌ని అమీర్ వ్యాఖ్యానించారు. నిజానికి ఈ సినిమాపై బాయ్ కాట్ ప్ర‌భావం స్ప‌ష్టంగా పడింది. ఒక్క రోజులోనే 100 కోట్లు వ‌సూళ్లు తేగ‌ల సామ‌ర్ధ్యం ఉన్న హీరో సినిమాపై 10 కోట్లు తెచ్చిందంటేనే? బాయ్ ప్ర‌భావం ఏ స్థాయిలో ప‌నిచేసింద‌న్న‌ది అద్దం ప‌ట్టింది.

తాజాగా ఈ సినిమా గురించి అమీర్ ఖాన్ సోద‌రుడైన పైస‌ల్ ఖాన్ సంచ‌న‌ల వ్యాఖ్య‌లు చేసారు. ''లాల్ సింగ్ చ‌డ్డా అంత గొప్ప సినిమా కాదు. ఎటువంటి వ్య‌తిరేక‌త లేకున్నాఆ సినిమాకి వ‌సూళ్లు వ‌చ్చేవి కాదు. సినిమాలో అంత విష‌యం లేదు. అలాంట‌ప్పుడు వ‌సూళ్లు ఎలా సాధ్య‌మ‌వుతుంది. సినిమా విడుద‌ల‌య్యాక నిర‌స‌న‌కారుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన అమీర్ అదే ప‌ని ముందు చేసి ఉంటే బాగుండేది.

సినిమా కోసం క్ష‌మాప‌ణ‌లు అడ‌గ‌డం బావ్యం కాదు. ఆయ‌న క్ష‌మాప‌ణ‌ల్ని బ‌ట్టి ఆయ‌న ఉద్దేశం ఏంట‌న్న‌ది తెలుస్తుంది. ఆయ‌న‌తో నాకేవో గొడ‌వ‌లు ఉన్నాయ‌ని ఇలా స్పందించ‌లేదు. ప్ర‌స్తుతం మా మ‌ధ్య ఎలాంటి వివాదాలు లేవు. ఇద్ద‌రం స‌ఖ్య‌త‌తోనే ఉంటున్నాం' అని అన్నారు.

అలాగే మీరు బిగ్ బాస్ కి వెళ్తారా? అంటే పైస‌ల్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. మునుప‌టిలా గృహ‌నిర్భంధంలో ఉండాల‌నుకోవ‌డం లేదు. స్వేచ్ఛ‌గా జీవించాల‌నుకుంటున్నా. నీటిలో నావ‌లా ప్ర‌వ‌హించాల‌నుకుంటున్నా అని చెప్పుకొచ్చారు.

ఏది ఏమైనా పైస‌ల్ ఖాన్ సోద‌రుడి సినిమాపై నెగిటివ్ పీడ్ బ్యాక్ ఇవ్వ‌డం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు లేక‌పోతే సినిమా గురించి ఇలా ఎందుకు స్పందిస్తారు? ఎంతైనా బంధుత్వం గుర్తుకురాదా? అంటూ అమీర్ అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.