Begin typing your search above and press return to search.
నేల టికెట్ భామకి ఏంకాలేదు బాబూ
By: Tupaki Desk | 28 Feb 2018 7:16 AM GMTఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా ఉంటుంది మీడియా వ్యవహారం. కానీ సోషల్ మీడియా వచ్చాక.. ఇదిగో సిమ్ అంటే.. అదిగో ఇంటర్నెట్ కనెక్షన్ అంటున్నట్లు తయారైంది. ఇక్కడ కనెక్షన్ తప్పితే.. అవసరం(ఫోన్) గురించి పట్టించుకునే పని లేదు.
ఇప్పుడు ఓ యాక్సిడెంట్ వ్యవహారం ఇంతకు మించి ప్రచారం జరుగుతోంది. నేల టికెట్ అంటూ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఓ యాక్సిడెంట్ అయిందంటూ.. ముందు రవితేజకు గాయాలు అన్నారు. కొంత హంగామా తర్వాత హీరో సేఫ్ అని చెప్పారు. కానీ అంతలోనే హీరోకి కాదు.. హీరోయిన్ కి గాయాలయ్యాయి.. ఆమె ముంబై వెళ్లిపోయింది.. షూటింగ్ వాయిదాపడిపోయిందని అంటున్నారు. ఇప్పుడు ఇది కూడా వాస్తవం కాదని తెలుస్తోంది. హీరోయిన్ మాళవికా శర్మకు ఏం కాలేదట. అసలు యాక్సిడెంట్ లాంటిది ఏదీ జరగలేదని.. హీరోయిన్ ముంబై వెళ్లిపోయిందనే ప్రచారం అవాస్తవం అని తేల్చేశారు.
మాళవికా శర్మ ఇవాళ కూడా ఎంచక్కా షూటింగ్ లో పాల్గొందట. మరి ఇంతకీ అసలు ఈ రూమర్ ఎలా వచ్చింది అంటే మాత్రం చెప్పడం అసాధ్యమైన విషయమే. ప్రస్తుతం ఈ నేల టికెట్ మూవీ.. హైద్రాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఫిదా ఫేమ్ శక్తి కాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు.