Begin typing your search above and press return to search.

నైజాం లో అవి ఫేక్ క‌లెక్ష‌న్ ల‌ని తేల్చేశాడు

By:  Tupaki Desk   |   20 May 2022 6:30 AM GMT
నైజాం లో అవి ఫేక్ క‌లెక్ష‌న్ ల‌ని తేల్చేశాడు
X
బిగ్ స్టార్స్‌ సినిమా విడుద‌లైందంటే చాలు తొలి రోజు తొలి షో క‌లెక్ష‌న్ ల ద‌గ్గ‌రి నుంచి లెక్క‌లు మొద‌ల‌వుతాయి. ఓపెనింగ్స్ లెక్క‌లు.. ఫ‌స్ట్ డే వ‌సూళ్లు.. ఫ‌స్ట్ వీక్ రికార్డులు.. ఎన్ని కోట్లు కొల్ల గొట్టింది.. ఎన్ని కొట్ల‌ని టార్గెట్ చేసింది? అనే లెక్క‌లు మొద‌లు ఓవ‌రాల్ ఆల్ టైమ్ ర‌న్ క‌లెక్ష‌న్ ల వ‌ర‌కు వివిధ ద‌శ‌ల్లో క‌లెక్ష‌న్ ల లెక్క‌లు చెబుతుంటారు. పెద్ద పెద్ద ఫిగ‌ర్ల‌తో పోస్ట‌ర్ ల‌ని విడుద‌ల చేస్తుంటారు. ఎంత ఎక్కువ క‌లెక్ట్ చేస్తే అంత గొప్ప‌.. అభిమానులు కాల‌ర్ ఎగ‌రేయ‌డాలు.. వంటివి గ‌త కొంత కాలంగా స‌ర్వ‌సాధార‌ణం అయిపోయాయి.

ప్ర‌స్తుతం నైజాం ఏరియాలో విడుద‌ల‌వుతున్న చిత్రాల క‌లెక్ష‌న్ లు, వాటి లెక్క‌లు గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్న విష‌యం తెలిసిందే. మా మీరో సినిమా ఫ‌స్ట్ డే ఈ రేంజ్ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిందంటే.. మా హీరో సినిమా ఈ రేంజ్ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి పాత రికార్డుల్ని తిర‌గ‌రాసింద‌ని మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేసుకోవ‌డం ..దానికి నిర్మాత‌లు కూడా వంత ప‌డ‌టం ప‌రి పాటిగా మారిపోయింది. అయితే గ‌త కొంత కాలంగా నైజాం ఏరియా వైడ్ గా స్టార్ హీరోల చిత్రాల‌కు చూపిస్తున్న లెక్క‌లన్నీ త‌ప్పుల త‌డ‌క‌ల‌ని, ఫేక్ క‌లెక్ష‌న్స్ అని తెలుస్తోంది.

ఈ విష‌యాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్, డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు ఇటీవ‌ల ఇండైరెక్ట్ గా బ‌య‌ట‌పెట్టేశారు. గ‌త కొంత కాలంగా నైజాం లో స్టార్ హీరోల చిత్రాల‌ని విడుద‌ల చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది ఈయ‌న‌. దీంతో ఫేక్ క‌లెక్ష‌న్ ల‌ని చెబుతోంది కూడా ఈయ‌నే అనే అప‌వాదు గ‌త కొంత కాలంగా వినిపిస్తోంది. హీరో కోస‌మో లేక అతని ఫ్యాన్స్ కోస‌మే.. లేక నిర్మాత కోస‌మే ఫేక్ క‌లెక్ష‌న్ ల చెప్పుకుంటూ వ‌స్తున్నారు. కానీ ఆ విష‌యంలో త‌న ప్ర‌మేయం అస‌లే లేద‌ని స్ప‌ష్టం చేశారు దిల్ రాజు.

స్టార్ సినిమాకు సంబంధించిన క‌లెక్ష‌న్ ల‌ని ఏ రోజుకు ఆరోజు నిర్మాత‌కు పంపిస్తుంటామ‌ని, అంతే త‌ప్ప ఆ విష‌యంలో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని, అయితే ఆ క‌లెక్ష‌న్స్ ఒరిజిన‌ల్ ఫిగ‌ర్ ఏంట‌న్న‌ది తాను బ‌య‌టికి చెప్ప‌లేన‌ని తెలిపారు. అంటే బ‌య‌టికి వ‌స్తున్న క‌లెక్ష‌న్స్ ఫేక్ క‌లెక్ష‌న్స్ అని ఇండైరెక్ట్ గా చెప్పేశార‌న్న‌మాట‌. అంతే కాకుండా ఫేక్ క‌లెక్ష‌న్స్ వ‌ల్ల నిర్మాత‌కు పెద్ద‌గా ఒరిగేది ఏమీ వుండ‌ద‌ని, వాటి వ‌ల్ల ఫ్యాన్స్ కొంత వ‌ర‌కు ఆనంద‌ప‌డ‌తారు అంతే అని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు.

ఇక టికెట్ రేట్లు హైక్ చేయ‌డం కూడా త‌న‌ప‌నే న‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై కూడా దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. టికెట్ రేట్లు పెర‌గ‌డానికి, పెంచ‌డానికి ప్ర‌ధాన కార‌ణం నిర్మాత‌లు, హీరోలే. వాళ్లు కోర‌డం వ‌ల్లే టికెట్ రేట్లు పెంచాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని తెలిపారు. కేజీఎఫ్ 2 విష‌యంలోనూ అదే జ‌రిగింద‌ని, నిర్మాతే టికెట్ రేట్లు పెంచాల‌ని అడిగార‌ని, అయితే తాను మాత్రం ఎష్ 3కి సాధార‌ణ టికెట్ రేట్ల‌నే కోరుకున్నాన‌ని చెప్పుకొచ్చారు.