Begin typing your search above and press return to search.
వర్మకు అమృత పేరుతో ఫేక్ లెటర్ రాసిందెవరు?
By: Tupaki Desk | 22 Jun 2020 3:00 PM GMTమిర్యాలగూడలో సంచలనం సృష్టించిన పరువు హత్య నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘మర్డర్’ పేరుతో తాజాగా సినిమా తీయబోతున్నట్టు ప్రకటించాడు.అయితే దీనిపై బాధితురాలు అమృత పేరిట వర్మకు వ్యతిరేకంగా సుధీర్ఘమైన లేఖ ఒకటి బయటకు వచ్చింది. మీడియా దీన్ని హైలెట్ చేసింది. మహిళను ఎలా గౌరవించాలో చెప్పే తల్లి లేనందుకు రాంగోపాల్ వర్మపై జాలిపడుతున్నా’ అంటూ వర్మపై అమృత నిప్పులు చెరిగినట్టు అన్ని మీడియా సంస్థల్లో వచ్చింది.
అయితే తాజాగా అమృత మామ అయిన బాలస్వామి ఈ వివాదంపై హాట్ కామెంట్స్ చేశారు. అసలు వర్మ సినిమాపై మా అమృత ఇప్పటిదాకా స్పందించలేదని.. అమృత పేరిట వర్మకు రాసిన లేఖ అవాస్తవమని.. అది నకిలీ లేఖ అని సంచలన నిజాలు వెల్లడించాడు. ఈ లేఖను ప్రణీత్ అనే వ్యక్తి రాసి ట్విట్టర్ లో రాంగోపాల్ వర్మకు సమాధానంగా పెట్టాడని వివరించారు.
అయితే అమృతనే స్పందించిందని తెలుసుకున్న రాంగోపాల్ వర్మ.. అమృత, ఇంకెవరైనా సరే వేధన అనుభవించిన వారిపై నాకు చాలా గౌరవం ఉందని.. వారు ఎదుర్కొన్న పరిస్థితులనే తాను ‘మర్డర్’ సినిమాలో చూపిస్తానని వర్మ తెలిపారు. ఈ సినిమాలో ఎవరినో చెడ్డవారిగా చూపించబోతున్నానని అనడం మూర్ఖత్వమని వర్మ అన్నారు.ఎవరూ చెడ్డ వారు కాదని.. పరిస్థితులే మనిషిని చెడుగా ప్రవర్తించేలా చేస్తాయని అన్నారు.
కాగా ఆర్జీవీ దర్శకత్వ పర్యవేక్షణలో సాగుతున్న ‘మర్డర్ ’ చిత్రానికి ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. మారుతీరావు పాత్రలో నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు.