Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ విడాకులు.. అసలు విషయం ఇదే

By:  Tupaki Desk   |   5 Jan 2023 1:03 PM GMT
సూపర్ స్టార్‌ విడాకులు.. అసలు విషయం ఇదే
X
తమిళ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్ మరియు ఆయన భార్య సంగీత విడాకులు తీసుకున్నారని.. సుదీర్ఘ కాల వైవాహిక జీవితానికి వీరిద్దరు ఫుల్‌ స్టాప్‌ పెట్టి విడాకులు తీసుకున్నారు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మీడియాలో ప్రముఖంగా వస్తున్న ఈ వార్తలతో విజయ్ అభిమానులు గందరగోళానికి గురి అవుతున్నారు.

ఆ మధ్య దర్శకుడు అట్లీ ఇంట్లో ఫంక్షన్ కి విజయ్ ఒంటరిగా వెళ్లాడు. అలాగే వారిసు యొక్క ఈవెంట్ లో కూడా సంగీత కనిపించలేదు. పైగా గత కొన్ని వారాలుగా విజయ్ మరియు సంగీత కలిసి ఏ ఒక్క కార్యక్రమంలో జంటగా కనిపించలేదు. దాంతో విడాకుల విషయం నిజమే అయ్యి ఉంటుందని అభిమానులు కూడా ఒక అంచనాకు వస్తున్నారు.

ఈ సమయంలో ఒక జాతీయ మీడియా సంస్థ ఈ విషయమై క్లారిటీ ఇచ్చింది. విజయ్ సన్నిహితులతో ఆ మీడియా సంస్థ ముచ్చటించిన సమయంలో అసలు విషయం వెళ్లడయ్యిందట. ప్రస్తుతం సంగీత పిల్లలతో కలిసి అమెరికాలో హాలీడేస్ ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అందుకే ఆమె ఇక్కడ విజయ్ తో ఏ ఒక్క కార్యక్రమంలో ఈ మధ్య కాలంలో కనిపించలేదు.

ఆమె అమెరికాలో ఉండటంతో విజయ్ ఒంటరిగా అన్ని కార్యక్రమాలకు హాజరు అయ్యారు. అంత మాత్రానికే పెద్ద ఎత్తున విడాకుల వార్తలు ప్రచారం జరిగాయట. ఈ విషయాన్ని విజయ్‌ సన్నిహితులు దృవీకరించారు. మీడియాలో వస్తున్న వార్తలు నూరు శాతం అబద్దం అంటూ వారు క్లారిటీ ఇచ్చారు. విజయ్ మాత్రం విడాకుల విషయమై పెద్దగా స్పందించలేదు.

ఇక విజయ్‌ నటించిన వారిసు సినిమా తెలుగు లో వారసుడుగా ఈనెల 11న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన వారసుడు ను దిల్‌ రాజు నిర్మించగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. రికార్డు స్థాయి లో ఈ సినిమా తమిళనాట మరియు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.