Begin typing your search above and press return to search.
'భీమ్లా నాయక్' రిలీజ్ పై ఫేక్ న్యూస్ వైరల్
By: Tupaki Desk | 24 Feb 2022 8:00 PM ISTస్టార్ హీరో సినిమా థియేటర్లలో కి వచ్చేస్తోందంటే అభిమానులు చేసే హంగామా వేరు. అభిమాన హీరో సినిమాని తొలి రోజు తొలి షోనే చూడాలని స్టూడెంట్స్ నుంచి పెద్దల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ రోజు ఎలాంటి ఇంపార్టెంట్ కార్యక్రమం వున్నా దాన్ని వాయిదా వేసి మరీ అభిమాన హీరో సినిమాకి చెక్కేస్తుంటారు. కొంత మందైతే ఏకంగా బాస్ లకు అబద్దాలు చెప్పేసి డ్యూటీ డుమ్మా కొట్టేసి థియేటర్లలో ప్రత్యక్షమవుతుంటారు. ఇక ఐటీ కంపనీలు క్రేజీ స్టార్ ల సినిమాల రిలీజ్ ల సందర్భంగా సెలవులు ప్రకటించడం.. తమ స్టాఫ్ కు ఓ షో టికెట్ లు బుక్ చేయడం వంటివి చేస్తున్నాయి.
అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` రిలీజ్ సందర్భంగా ఏపీలోని ఆంధ్రా యూనివర్శిటీ ఏకంగా సెలవు ప్రకటించిందంటూ ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. సాఫ్ట్ వేర్ కంపనీలు పెలవు ప్రకటించడం విన్నాం..ఇదేంటీ ఏకంగా యూనివర్శిటీనే సెలవు ప్రకటించడం ఏంటని అంతా అవాక్కవుతున్నారు. ఆంధ్రా యూనివర్శిటీ పేరు మీద ఓ సర్క్యులర్ గత రెండు రోజులుగా నెట్టింట వైరల్ గా మారడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది.
`విద్యార్థుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని `భీమ్లా నాయక్` విడుదల సందర్భంగా శుక్రవారం ఆంధ్రా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సెలవు ప్రకటిస్తున్నట్టుగా సదరు సర్క్యులర్ లో వుంది. దీంతో ఇది నిజమేనా? కాదా? యూనివర్శిటీ సినిమా రిలీజ్ సందర్భంగా సెలవు ప్రకటించడం ఏంటీ? అని పలువురు విద్యార్థులు ఆరాతీశారు. దీంతో అసలు విషయం బయటపడింది.
ఆంధ్రా యూనివర్శిటీ సర్క్యులర్ అంటూ నెట్టింట వైరల్ అవుతున్న వార్త పై ఆంధ్ర ప్రదేశ్ `ఫ్యాక్ట్ చెక్ సెల్` వివరణ ఇచ్చింది. ఇది ఫేక్ న్యూస్ అని తేల్చేసింది. తాజా వార్తపై ఇంజినీరింగ్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ కూడా స్పందించారు. `కొత్త సినిమా విడుదల సందర్భంగా శుక్రవారం సెలవు ప్రకటించినట్టుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. సెలవుని ప్రకటిస్తూ మేము ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం ప్రచారంలో వున్న వార్త అవాస్తవం` అని క్లారిటీ ఇచ్చారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన `భీమ్లా నాయక్` ఈ శుక్రవారం భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ తో పోటా పోటీగా రానా నటించగా కీలక పాత్రల్లో నిత్యామీనన్, సంయుక్త మీనన్ నటించారు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సినిమాపై హైప్ ని క్రియేట్ చేసింది.