Begin typing your search above and press return to search.

త‌నూశ్రీ రో: వివాదం కిలాడీ మెడ‌కు?

By:  Tupaki Desk   |   8 Oct 2018 8:47 AM GMT
త‌నూశ్రీ రో: వివాదం కిలాడీ మెడ‌కు?
X
ప్ర‌జ‌ల్లో త‌న గుర్తింపుకు, త‌న ఉనికికి భంగం క‌లిగించే.. త‌న ప‌రువు మ‌ర్యాద‌ల‌కు భంగం క‌లిగించే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే ఏ స్టార్ హీరో అయినా ఊరుకుంటారా? స‌సేమిరా అంటారు క‌దా! బాలీవుడ్ స్టార్ హీరో - కిలాడీ అక్ష‌య్ కుమార్ సైతం అదే తీరుగా స్పందించారు. త‌న‌ని బ్యాడ్ చేస్తూ యూట్యూబ్‌ లో అప్‌ లోడ్ చేసిన ఓ మీడియా వ్య‌క్తిపై ఆయ‌న సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ప్ర‌స్తుతం పోలీస్ ఈ విష‌యంపై సీరియ‌స్‌ గా ఇన్వెస్టిగేష‌న్ సాగిస్తున్నారు.

ఇంత‌కీ ఏమైంది? అని ప్ర‌శ్నిస్తే గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ అందాల క‌థానాయిక త‌నూశ్రీ ద‌త్తా మి-టు క్యాంపెయినింగ్‌ తో అద‌ర‌గొడుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌పై లైంగిక వేదింపుల‌కు పాల్ప‌డిన వారు ఎంత‌టివారైనా వారిని రోడ్డు కీడ్చే ప‌నికి పూనుకున్నారు. ప్ర‌ఖ్యాత బాలీవుడ్ న‌టుడు నానా ప‌టేక‌ర్ పై త‌నూశ్రీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్ప‌టికే సంచ‌ల‌న‌మైంది. ఈ వివాదంలో కిలాడీ అక్ష‌య్ కుమార్ పేరు ప్ర‌స్తుతం జ‌నాల నోళ్ల‌లో నానుతోంది. త‌నూశ్రీ గురించి అక్ష‌య్ మాట్లాడిన ఓ ఇంట‌ర్వ్యూని యూట్యూబ్‌ లో పోస్ట్ చేశాడు స‌ద‌రు ఔత్సాహిక మీడియా ప్ర‌తినిధి. అందులో త‌నూశ్రీ పేరు మార్ఫింగ్ చేసి - ఎడిట్ చేసి క‌నిపించింది. కిలాడీ అక్ష‌య్ కుమార్ పేరును త‌నూశ్రీ వివాదంతో ముడిపెట్టి - ఆన్‌ లైన్‌ లో వీడియో అప్ లోడ్ చేయ‌డంతో దానిపై అక్ష‌య్ సీరియ‌స్ అయ్యారు. త‌న ప‌రువు మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్లింద‌ని బాంద్రా- కుర్లా కాంప్లెక్సులోని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

దీంతో త‌నూశ్రీ వివాదంలోకి కిలాడీ అక్ష‌య్ కుమార్ కూడా వ‌చ్చిన‌ట్ట‌య్యింది. ప్ర‌స్తుతం ఆ వీడియోని యూట్యూబ్ నుంచి తొల‌గించారు. అయితే ఆ లింక్ ప‌రిశీలించి స‌ద‌రు వ్య‌క్తిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు. ఐపీసీ పీన‌ల్ కోడ్ -ఐటీ సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేయ‌నున్నామ‌ని తెలిపారు. అక్ష‌య్ కుమార్ న‌టించిన గోల్డ్ జ‌న‌వ‌రిలో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించింది. తదుప‌రి ప‌లు భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.