Begin typing your search above and press return to search.
యూట్యూబ్ వ్యూస్.. కలెక్షన్ల విషయంలో ఒరిగేదేంటి?
By: Tupaki Desk | 29 Oct 2019 5:06 AM GMTసోషల్ మీడియా ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారకముందు సినిమా ప్రమోషన్స్ తీరు వేరుగా ఉండేది. ప్రింట్ మీడియా.. అదీ న్యూస్ పేపర్ లోనే ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్ లు రిలీజ్ అయ్యేవి. అవి కాకుండా మైదాను ఫుల్లుగా పోస్టర్ వెనక పూసి గోడకు అంటించేవారు. ఇది వాల్ పోస్టర్ పబ్లిసిటీ. సూపర్ గా ఉండే వాల్ పోస్టర్ లు చూడడం భలే సరదా. ఫ్యాన్స్..సాధారణ ప్రేక్షకులు వాటిని చూసి ఎంజాయ్ చేస్తే కొందరు కఠోరమైన యాంటిఫ్యాన్స్ మాత్రం పేడ కోసం వెతికేవారు!
అదంతా గతం గతః. పాతకాలం ప్రమోషన్స్.. ఇప్పుడు కూడా ఉంది కానీ దాదాపుగా తగ్గిపోయింది. ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రమోషన్లదే హవా. ట్విట్టర్.. ఎఫ్బీల తో పాటుగా యూట్యూబ్ ప్రమోషన్ కు కీలంగా మారింది. ముఖ్యంగా యూట్యూబ్ లో అధిక వ్యూస్ సాధించడం ప్రేక్షకాదరణకు ఒక కొలమానంగా మారాయి. కొంతకాలం క్రితం ఒక టీజర్.. ట్రైలర్.. లిరికల్ సాంగ్ కు వన్ మిలియన్ వ్యూస్ వస్తే పండగ చేసుకునేవారు. వన్ మిలియన్ వ్యూస్ తమ టీజర్ కో.. ట్రైలర్ కో రావాలని హీరోలు పట్టుబట్టేవారు. దీంత ఫేక్ వ్యూస్ తెప్పించే సంస్థలు కూడా వందల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. కొన్ని వ్యూస్ నిజం.. కొన్ని ఫేక్. ఈ ఫేక్ వ్యూస్ కోసం.. హీరో గొప్ప కోసం నిర్మాతలకు అదనపు ఖర్చు. నాటుగా చెప్తే.. అదో బొక్క!
ఇప్పుడు జమానా మారింది. అంటే వ్యూస్ విషయం పట్టించుకోవడం లేదని అనుకుంటారేమో. ఆ జబ్బు ఫుల్లుగా అంటుకుంది. గతంలో వన్ మిలియన్ వ్యూస్ తో సరిపెట్టుకున్న హీరోలు ఇప్పుడు తమ ప్రతి వీడియోకు 10 మిలియన్ అయినా మినిమమ్ ఉండాలని పట్టుబడుతున్నారట. నిజంగా మంచి కంటెంట్ అయితే 10 మిలియన్ ఏం ఖర్మ.. 50 మిలియన్లు కూడా వస్తాయి. అత్తెసరు కంటెంట్ అయితే ఎవరు పట్టించుకుంటారు? అయితే హీరోల ఈ అధిక వ్యూస్ వీక్నెస్ ను చాలామంది డబ్బు చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. వ్యూస్ తెప్పిస్తామని నిర్మాతల దగ్గర డబ్బులు భారీగా వసూలు చేస్తున్నారట.. కొందరైతే డబ్బు తీసుకుని వ్యూస్ తెప్పించకుండా పంగనామాలు కూడా పెడుతున్నారట.
ఇదంతా ఒక ఎత్తైతే అసలు ఈ వ్యూస్ వల్ల ఎంత ప్రయోజనం ఉందనేది మొదటినుంచి చర్చనీయాంశమే. ఒక సినిమా ట్రైలర్ కు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకుందాం. ఆ సినిమా హిట్ అవుతుందని గ్యారెంటీ ఉందా? నిజానికి 10 మిలియన్స్ వ్యూస్ లో సగం.. అంటే 5 మిలియన్ టికెట్స్ తెగితే ఆ సినిమా బాహుబలి రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటారు. అంటే.. పబ్లిసిటీకి.. ఫ్యాన్స్ గొప్పలు చెప్పుకోవడానికి ఈ వ్యూస్ హంగామా పనికొస్తుంది కానీ కలెక్షన్స్ రూపంలో ఆ వ్యూస్ మారడం లేదన్నమాట. అల్టిమేట్ గా సినిమాలోని కంటెంట్ మాత్రమే కలెక్షన్స్ రూపంలోకి మారుతుంది. అది మన హీరోలు.. ఫిలిం మేకర్లు గుర్తిస్తే అదే పదివేలు.