Begin typing your search above and press return to search.

ఫలక్ నుమా దాస్ కి బంపర్ డీల్

By:  Tupaki Desk   |   5 Jun 2019 5:36 AM GMT
ఫలక్ నుమా దాస్ కి బంపర్ డీల్
X
ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం థియేట్రికల్ బిజినెస్ నుంచి మాత్రమే నిర్మాత పెట్టుబడి వెనక్కు వచ్చే పరిస్థితి లేదు. అందుకే రకరకాల ఆప్షన్స్ మీద ఆధారపడక తప్పడం లేదు. చిన్న సినిమాలకు ఇదీ మరీ కీలకంగా మారుతోంది. అమెజాన్ లాంటి డిజిటల్ వెబ్ స్ట్రీమింగ్ సైట్స్ వచ్చాక కంటెంట్ ఉన్న మూవీస్ కి అవే కల్పతరువుగా మారుతున్నాయి.

ఇప్పుడు ఫలక్ నుమా దాస్ కూడా అలాంటి ఓ బంపర్ డీల్ దక్కించుకుంది. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగానే ఉన్న ఈ హైదరాబాదీ మూవీని నెట్ ఫ్లిక్స్ సంస్థ సుమారు రెండు కోట్లకు ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇది ఫలితాన్ని చూసి చేసింది కాదు. ట్రైలర్ రిలీజయ్యాకే సదరు సంస్థ నుంచి ఆఫర్ రావడం నిర్మాత వెంటనే ఒప్పేసుకోవడం చకచకా జరిగిపోయాయట.

హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్ చెప్పిన ప్రకారం పెట్టుబడిగా పెట్టిన ఐదు కోట్లలో అటు ఇటుగా సగం డిజిటల్ లో వచ్చేసింది. ఇంకా శాటిలైట్ ఇవ్వలేదు కానీ ఎంత లేదన్నా కోటిన్నర మినిమమ్ వస్తుంది. సురేష్ సంస్థ అందించిన రెండున్నర కోట్ల అడ్వాన్స్ తో పాటు ఇతర బాషల డబ్బింగ్ హక్కులు కలుపుకుంటే ఫైనల్ గా దాస్ లాభాలతో బయట పడేలా ఉన్నాడు.

హైదరాబాద్ మినహాయించి మిగిలిన ఏరియాలలో వీక్ డేస్ లో వీక్ గానే ఉన్న ఫలక్ నుమా దాస్ పెట్టుబడి లెక్కల్లో మాత్రం సేఫ్ గా బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది. మొన్నో వివాదం రేగినప్పటికీ దాన్ని సారీతో మేనేజ్ చేసిన విశ్వక్ దీన్ని ప్రమోషన్ తో ఇంకాస్త పుష్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. రేపటి నుంచి వరసగా సినిమాలు ప్లాన్ చేసిన నేపధ్యంలో ఆ పోటీని తట్టుకునేలా ఇంకాస్త జోరుగా ప్లాన్ చేస్తున్నారట.