Begin typing your search above and press return to search.
మా టార్గెట్ ఆడియన్స్ 14-30 ఏజ్ గ్రూప్: విష్వక్ సేన్
By: Tupaki Desk | 24 Feb 2019 10:35 AM GMTవిష్వక్ సేన్ హీరోగా నటిస్తున్న 'ఫలక్ నుమా దాస్' ట్రైలర్ రా & రియలిస్టిక్ కంటెంట్ తో ఒక్కసారిగా అందరికీ చిన్నపాటి జర్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓల్డ్ సిటీ వాతావరణాన్ని ప్రతిబింబించేలా తీసిన ఈ సినిమా ట్రైలర్ లో బూతుమాటలు వాడడంపై భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు అది రియాలిటీకి దగ్గరగా ఉంది అంటుంటే మరికొందరు మాత్రం బూతులు విచ్చలవిడిగా వాడడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై రీసెంట్ గా స్పందించాడు ఈ సినిమాకు దర్శక నిర్మాత కమ్ హీరో అయిన విష్వక్ సేన్. తాము ఇక్కడి జనాల రియల్ కల్చర్ చూపాలని అనుకున్నామని.. రోజువారీ జీవితంలో ఆ బూతుపదాల వాడుక చాలా సాధారణమని తెలిపాడు. ఈ సినిమా చిన్నపిల్లలకు.. వృద్దులకు కాదని ఒక స్లైడ్ చూపిస్తే సరిపోతుంది కదా అంటే.. 'ఫలక్ నుమా దాస్' 14-30 ఏజ్ గ్రూప్ వారికోసమే తీసిన సినిమా అని తమ టార్గెట్ ఆడియన్స్ వారేనని తెలిపాడు. 14 ఏళ్ళ వారికి అది వర్తమానం అని.. 30 ఏళ్ళ వారికి అది ఈమధ్యే జరిగిన గతం అని అభిప్రాయపడ్డాడు. బూతుల స్థానంలో బీప్ లు పెట్టె ఆలోచన లేదని.. రియల్ ఫీల్ కోసమే అలా చేస్తున్నామన్నాడు.
ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ 'అంగామలి డైరీస్' సినిమాకు రీమేక్ అనే సంగతి తెలిసిందే. రీమేక్ చేయడం గురించి మాట్లాడుతూ ఆ సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే నచ్చిందని.. తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు సెకండ్ హాఫ్ ను మార్చామని తెలిపాడు. మరి ట్రైలర్ సంచలనం సృష్టించినట్టే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుందేమో వేచి చూడాలి. మరోవైపు ఈ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ థియేటర్ల నుంచి వెళ్లిపోయేవరకూ విమర్శకులకు కూడా ఫుల్ పండగే. ఎందుకంటే వాళ్ళ నోరు నొప్పి పుట్టేదాకా డిబేట్లు.. విమర్శలు చేస్తూ ఇండియా ఇంకా డెవెలప్ కాకుండా ఉండడానికి 'ఫలక్ నుమా దాస్' లోని బూతులే కారణం అని ఆడిపోసుకోవచ్చు కదా.. ఏమంటారు?