Begin typing your search above and press return to search.

ఫ్యామిలీమ్యాన్ 3.. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!

By:  Tupaki Desk   |   22 Feb 2022 4:30 AM GMT
ఫ్యామిలీమ్యాన్ 3.. ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!
X
ముందుంది ముస‌ళ్ల పండ‌గ‌!.. తీవ్ర‌వాదం కాన్సెప్టుల‌కు ఎండ్ అన్న‌దే లేద‌ని రాజ్ అండ్ డీకే నిరూపించ‌బోతున్నారు. ఉగ్ర‌వాద ప్రేరేపిత పాక్ ఆగ‌డాలు.. తీవ్ర‌వాదం.. నేప‌థ్యంలో రాజ్ అండ్ డీకే రూపొందించిన ఫ్యామిలీమ్యాన్ సిరీస్ కి కొన‌సాగింపు ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.

నిజానికి ఈ సిరీస్ లో మూడో భాగం ఉంటుంద‌ని ఎవ‌రూ అంచ‌నా వేయ‌లేదు. సీజ‌న్ 2తో ముగుస్తుంద‌నే అనుకున్నారు. కానీ ఈ సిరీస్ అంత‌కంత‌కు సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ ఆద‌ర‌ణ‌తో అత్యంత స‌క్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ఫ్రాంఛైజీగా ఇది రూపాంత‌రం చెందింది. ఇప్ప‌టికే రెండు సీజ‌న్లు బంప‌ర్ హిట్లు అయ్యాయి అంటే తెలుగు కుర్రాళ్లు రాజ్ అండ్ డీకే నేరేట్ చేసిన విధానం అంత‌గా వ‌ర్క‌వుటైంద‌నే అర్థం.

ప్రతిభావంతులైన ద‌ర్శ‌క ర‌చ‌యిత‌ల‌ ద్వయం రాజ్ నిడిమోరు - కృష్ణ DK `ది ఫ్యామిలీ మ్యాన్` సిరీస్ ని కొన‌సాగించ‌నున్నారు. ఫ్రాంఛైజీలో తొలి భాగం 2019లో విడుదలైంది. వీక్షకులకు గ్రిప్పింగ్ స్టోరీ నేరేష‌న్ తో ట్రీటిచ్చింది. జాతీయ ఉత్త‌మ న‌టుడు మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ లో జాతీయ ఉత్త‌మ‌న‌టి ప్రియ‌మ‌ణి ప్ర‌ద‌ర్శ‌న కూడా అన‌న్య సామాన్యం. గత సంవత్సరం రెండవ సీజన్ లో స‌మంత రంగ ప్ర‌వేశం బంప‌ర్ హిట్ అయ్యింది. రాజీ అనే తీవ్ర‌వాదిగా సామ్ న‌ట‌న‌కు జ‌నం జేజేలు ప‌లికారు.

సీజ‌న్ 2 బంప‌ర్ హిట్ అయ్యాక ద‌ర్శ‌క‌నిర్మాత‌లు మూడవ సీజన్ తో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. నిజానికి రెండవ సీజన్ ముగింపు కోల్ కతాలో ఒక రహస్య వ్యక్తి ఇంట్రోతో ఉంటుంది.. చైనీస్ మిషన్ గ్వాన్ యు కోసం సిద్ధమవుతున్న అత‌డి క‌థేంటో మూడవ సీజన్ లో చూపించే వీలుంది. క్లైమాక్స్ ఎలా ఉంటుంది?అంటే.. మూడవ సీజన్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో తీవ్ర‌వాదం ప్ర‌భావం చూపించే వీలుంది.

ఈ సంవత్సరం చివరి నాటికి పార్ట్ 3 చిత్రీకరణను ప్రారంభించాలని రాజ్ అండ్ డీకే ఆలోచిస్తున్నార‌ట‌. ఇప్పటికే స్క్రిప్ట్ పై పని మొద‌లైంది. కథ ఇంకా అభివృద్ధిలో ఉంది. ప్రస్తుతానికి ది ఫ్యామిలీ మ్యాన్ 3 సంవత్సరం చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. మూడో సీజన్‌లో చేరనున్న సపోర్టింగ్ కాస్ట్ వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

ది ఫ్యామిలీ మ్యాన్ రెండు భాగాల్లో క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ మనోజ్ బాజ్ పేయితో పాటు ప్రియమణి- సమంతా రూత్ ప్రభు-షరీబ్ హష్మీ - శ్రేయ ధన్వంతరి పాత్ర‌లు ఉన్నాయి. ప్ర‌స్తుతం రాజ్ అండ్ డీకే వేరే ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్- రాశి ఖన్నా -విజయ్ సేతుపతి ల‌తో వెబ్ సిరీస్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

రాజ్ అండ్ డీకే తదుపరి సిరీస్ పేరు గన్స్ అండ్ గులాబ్స్. ఇందులో రాజ్ కుమార్ రావు- దుల్కర్ సల్మాన్ -ఆదర్శ్ గౌరవ్ న‌టిస్తురు. అలాగే వరుణ్ ధావన్ -సమంత ల‌తో సిటాడెల్ సిరీస్ రూప‌క‌ల్ప‌న‌లోనూ ఉన్నారు.