Begin typing your search above and press return to search.
కేజీఎఫ్-2 రైట్స్ కొనేసిన ప్రముఖ హీరో..!
By: Tupaki Desk | 6 Jan 2021 5:45 AM GMTయాక్షన్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రం ‘కేజీఎఫ్’. ఈ మూవీ కొట్టిన విక్టరీ రీసౌండ్ కు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రళయకాల గర్జన చేసిందీ చిత్రం. దీంతో.. ‘కేజీఎఫ్ చాప్టర్-2’ కోసం ఈ చిత్ర అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
చాప్టర్-1తో దర్శకుడిగా ప్రశాంత్ నీల్, హీరోగా యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం ఈ స్థాయి యాక్షన్ సినిమాను ఇప్పటివరకు చూడలేదని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘కెజిఎఫ్ 2’లో దేశంలోని వివిధ సినీ పరిశ్రమల నటీ నటులు ఉన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఈ క్రమంలో సినిమా బిజినెస్ కూడా వాణిజ్య వర్గాల్లో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఈ చిత్రం కేరళ రైట్స్ ను ప్రముఖ హీరో సొంతం చేసుకున్నారు. మలయాళ హీరో కమ్ చిత్రనిర్మాత పృథ్వీ రాజ్.. కేరళ రాష్ట్రం మొత్తానికి ఈ చిత్రాన్ని పంపిణీ చేసే హక్కులను కొనేశారు.
హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్, రవీనాటాండన్ తోపాటు ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ టీజర్ ను జనవరి 8న హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.