Begin typing your search above and press return to search.
ప్రముఖ సింగర్/నటుడిపై లైంగిక, గృహహింస కేసు
By: Tupaki Desk | 4 Aug 2021 12:30 AM GMTసంసారాలు సాఫీగా సాగినంత కాలం బయటకు ఏదీ రాదు.. అదే గొడవలు మొదలయ్యాయా? అంతే సంగతులు.. ప్రముఖ బాలీవుడ్ సింగర్, నటుడు యోయో హనీసింగ్ సంసారం కూడా ఇప్పుడు రచ్చకెక్కింది. సొంత భార్యనే ఆయనపై కేసు పెట్టింది.
నటుడు, సింగర్ హనీసింగ్ పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస , లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసింది. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో ‘గృహ హింస నుంచి మహిళల రక్షణ చట్టం’ కింద మంగళవారం పిటీషన్ దాఖలు చేసింది. తిస్ హజారీ కోర్టు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తానియా సింగ్ ముందు ఈ కేసు నమోదు చేయబడింది. ఈ క్రమంలోనే కోర్టు సింగర్ హనీసింగ్ కు నోటీసులు జారీ చేసింది.
భార్య షాలినిని వేధించిన కేసులో నోటీసులు అందుకున్న సింగర్ హనీసింగ్ ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాల్సిందిగా కోర్టు నోటీసులో ఆదేశించింది. హనీసింగ్, అతడి భార్య పేరు మీద ఉన్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలులేకుండా.. షాలిని తల్వార్ కు అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
‘రాస్టార్’ అనే రియాలిటీ షోలో 2014లో హనీసింగ్ తన భార్యను జనాలకు పరిచయం చేశాడు. బాలీవుడ్ లో పలు భారీ ప్రాజెక్టులలో పనిచేయడానికి ముందే హనీసింగ్ కు పెళ్లి అయ్యిందని తెలిసి అంతా షాక్ అయ్యారు. ఈ విషయాన్ని హనీసింగ్ గోప్యంగా ఉంచడం విశేషం.
హనీసింగ్ గాయకుడిగా బాలీవుడ్ లో ఫేమస్.. సైఫ్ అలీకాన్, దీపికా పడుకొనే జంటగా వచ్చిన ‘కాక్ టెయిల్ ’ చిత్రంలో అంగ్రేజీ పాటతో పాపులర్ అయ్యాడు. ఈ పాట 2011లో సూపర్ హిట్ టాప్ సాంగ్ గా నిలిచింది. ఆ తర్వాత నుంచి హనీ సింగ్ బాలీవుడ్ కెరీర్ బాగా సాగింది.
తాజాగా హనీసింగ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అతడి కెరీర్ ఇబ్బందుల్లో పడింది. భార్య ఫిర్యాదు మీద హనీ సింగ్ ఇంకా స్పందించలేదు.