Begin typing your search above and press return to search.
ఇదేం అభిమానం బాబోయ్...
By: Tupaki Desk | 7 Feb 2019 11:30 AM GMTస్టార్స్ కొన్ని సార్లు అభిమానుల చేష్టలతో చిరాకు పడ్డ సందర్బాలు చాలానే చూశాం. ఎంతో మంది స్టార్ హీరోలు హీరోయిన్స్ అభిమానుల వల్ల అవస్థలు పడ్డారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా అభిమాని వల్ల బాబోయ్ అనుకునే పరిస్థితి వచ్చింది. తాజాగా అక్షయ్ కుమార్ ఇంట్లోకి వీరాభిమాని అయిన ఒక వ్యక్తి అర్థరాత్రి సమయంలో చొరబడి నానా హంగామా చేశాడు. గూగుల్ లో అక్షయ్ కుమార్ అడ్రస్ ను కనిపెట్టి మరీ వెళ్లి నట్లుగా చెబుతున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... హరియాణాకు చెందిన అంకిత్ బాలీవుడ్ లో నటుడిగా రాణించాలనేద కోరిక. ఆ కోరికతో తనకు అత్యంత ఇష్టమైన అక్షయ్ కుమార్ ను కలిసి తన కోరికను చెప్పాలనుకున్నాడు. అక్షయ్ కుమార్ సాయంతో బాలీవుడ్ లో పరిచయం అవ్వాలని ప్రయత్నించాడు. ఇంటర్నెట్ లో మొదట అక్షయ్ కుమార్ అడ్రస్ ను తెలుసుకుని, ఆ తర్వాత కలుసుకునేందుకు వెళ్లాడు. కాని అక్షయ్ కుమార్ ఇంటి ముందు ఉండే సెక్యూరిటీ గార్డులు లోనికి వెళ్లేందుకు అనుమతించలేదు. దాంతో చేసేది లేక అర్థ రాత్రి సమయంలో పెన్సింగ్ గోడను దూకి ఇంట్లోకి వెళ్లాడు. రాత్రి సమయంలో అక్షయ్ కుమార్ ఇంట్లోకి వెళ్లేందుకు అంకిత్ చాలానే కష్టపడ్డాడు.
ఇంట్లోకి వెళ్లిన తర్వాత పెద్దగా కేకలు వేయడంతో అంతా అలర్ట్ అయ్యారు. వెంటనే బయట నుండి సెక్యూరిటీ గార్డ్ లోనికి వెళ్లి అతడిని బలవంతంగా బయటకు తీసుకు వచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అంకిత్ ను అరెస్ట్ చేశారు. తాను అక్షయ్ కుమార్ తో అభిమానంతోనే ఆ ఇంట్లోకి వెళ్లాను అని, మరే ఉద్దేశ్యం తనకు లేదని, ఆయన్ను కలుసుకునేందుకు ప్రయత్నించాను అంటూ పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. అక్షయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అంకిత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా చెబుతున్నారు.