Begin typing your search above and press return to search.

దుల్కార్ అభిమాని ఊహాతీత మ‌ర‌ణం

By:  Tupaki Desk   |   5 Aug 2018 4:17 AM GMT
దుల్కార్ అభిమాని ఊహాతీత మ‌ర‌ణం
X
అభిమానుల అత్యుత్సాహం అప్పుడ‌ప్పుడు కొంప‌లు ముంచేస్తుంద‌నడానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. త‌మ అభిమాన హీరోని ద‌గ్గ‌ర‌గా చూడాల‌న్న ఆత్రం ఒక్కోసారి ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతుంది. మ‌న స్టార్ హీరోల ఆడియో - ప్రీరిలీజ్ ఈవెంట్ల వేళ వెన్యూ ద‌గ్గ‌ర హ‌డావుడి చూస్తే అస‌లు సంగ‌తి క్లియ‌ర్‌ క‌ట్‌ గా అర్థ‌మ‌వుతుంది. ఎంత‌సేపూ ఎగ్జ‌యిట్‌ మెంట్‌ తో ఏం చేస్తున్నారో అర్థం కాని స‌న్నివేశం ఉంటుంది. గోడలు దూకి - తోపులాట‌ల‌తో నానా ర‌చ్చ చేస్తుంటారు. ఒక్కోసారి ఇలాంటి స‌న్నివేశంలో చావును కొని తెచ్చుకునే వాళ్లు ఉన్నారు.

అప్ప‌ట్లో రామ్‌ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్‌ - ప‌వ‌న్ క‌ల్యాణ్ వంటి టాప్ స్టార్ల అభిమానులు ప్ర‌మాదాల‌కు గురైన సంఘ‌ట‌న‌లు చూశాం. అత్యుత్సాహంలో తోపులాట‌ల్లో కొంద‌రు - క‌రెంట్ తీగ‌లు తాకి మ‌రికొంద‌రు మ‌ర‌ణాల‌కు గుర‌య్యారు. ఆ క్ర‌మంలోనే అభిమానుల దుర్మ‌ర‌ణాలు అంద‌రికీ బాధ క‌లిగించాయ‌ని - ఇంటి ద‌గ్గ‌ర మీకోసం ఎదురు చూసే కుటుంబ స‌భ్యుల కోసం అయినా ఎంతో జాగ్రత్త‌గా ఉండాల‌ని తార‌క్ పదే ప‌దే వేదిక‌ల‌పైనే హెచ్చ‌రించారు.

అవ‌న్నీ పాత ఎపిసోడ్స్ అనుకుంటే.. తాజాగా ఓ కొత్త ఇన్సిడెంట్ తీవ్రంగా క‌ల‌చి వేసింది. నిన్న‌టిరోజున సౌత్ స్టార్ హీరో - `ఓకే బంగారం` ఫేం దుల్కార్ స‌ల్మాన్ కేర‌ళ కొల్లాంలో ఓ మాల్‌ ప్రారంభోత్స‌వానికి వెళ్లాడు. దుల్కార్ వ‌స్తున్నాడ‌ని తెలుసుకున్న వీరాభిమానులు భారీ మొత్తంలో అక్క‌డికి చేరుకున్నారు. హీరో రాగానే తీవ్ర‌మైన‌ తోపులాట మొద‌లైంది. ఆ తోపులాట‌లో ఓ అభిమాని అక్క‌డిక‌క్క‌డే గుండె పోటుతో మ‌ర‌ణించాడు. ఆ దృశ్యం అంద‌రినీ క‌లిచి వేసింది. అత‌డిని బ‌తికించ‌డానికి ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించినా అప్ప‌టికే మ‌ర‌ణించాడు. హ‌రి అనే ఆ అభిమాని త్రివేండ్రం నుంచి దుల్కార్‌ ని చూసేందుకు వ‌చ్చాడ‌ట‌. అత‌డికి ఇంత‌కుముందే గుండె నొప్పిని ఎదుర్కొన్నాడు. ఈసారి ప్ర‌మాద‌క‌ర ఎటాక్‌ ని ఎదుర్కొని దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. ఈ ఇన్సిడెంట్‌ కి కార‌కులైన షాపింగ్ మాల్ య‌జ‌మానిపై పోలీసులు కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు. ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేసేందుకు స‌రైన ఏర్పాట్లు చేయ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని పోలీసులు ఫిర్యాదు చేస్తున్నారు. అత్యుత్సాహం కంటే ప్రాణం మిన్న‌! అన్న నిజాన్ని పిచ్చి ఫ్యాన్స్ ఎన్న‌టికి గుర్తెరుగుతారో?