Begin typing your search above and press return to search.
లైవ్ లో సన్నీకి వంద కోట్ల కట్నం ఆఫర్ చేసింది
By: Tupaki Desk | 30 Dec 2021 4:55 AM GMTతెలుగు బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచిన వారు స్టార్స్ గా గుర్తింపు దక్కించుకోలేక పోతున్నారు. కాని సోషల్ మీడియాలో మంచి పాపులారిటీని మాత్రం దక్కించుకుంటున్నారు. మంచి పాపులారిటీని దక్కించుకున్న బిబి విన్నర్స్ కొందరు ఆ పాపులారిటీని వినియోగించుకుంటున్నారు. మరి కొందరు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండి పోతున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా నిలిచిన సన్నీ మాత్రం తనకు వచ్చిన క్రేజ్ తో కెరీర్ ను చక్కగా మల్చుకుంటాడనే టాక్ వినిపిస్తుంది. అతడు ప్రతి విషయంలో తీసుకునే నిర్ణయాలు.. అతడి పద్దతి ప్రవర్తన అన్ని విషయాలు కూడా జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా షన్నూ మరియు సిరిల విషయంలో విమర్శలు చేయవద్దంటూ మంచి మనసుతో పదే పదే విజ్ఞప్తి చేయడం ఆయనకే చెల్లింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఇప్పుడు సన్నీ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా సన్నీ ఉంటున్నాడు. అతడు తాజాగా అభిమానులతో లైవ్ లో చిట్ చాట్ చేశాడు. ఆ సమయంలో ఒక లేడీ తాను యూఎస్ నుండి అంటూ తనను తాను పరిచయం చేసుకుని తన కూతురును పెళ్లి చేసుకోవాలంటూ ప్రపోజల్ పెట్టింది. అందుకు గాను ఏకంగా వంద కోట్ల కట్నం ఇస్తానంటూ లైవ్ లోనే ఆఫర్ చేసింది. అందుకు కొన్ని సెకన్లు షాక్ అయిన సన్నీ ఆ తర్వాత తేరుకుని నన్ను చేసుకునే అమ్మాయికి ఓపిక చాలా ఉండాలి.. నన్ను భరించడం అంత తేలిక కాదు అన్నాడు. ఆమె నుండి సరే అనే సమాధానం వచ్చింది.
సన్నీ ఆ విషయాన్ని మరింతగా చర్చించకుండా మీరు అలా అనడం చాలా సంతోషం అన్నట్లుగా నవ్వేశాడు. అయినా కూడా ఆమె కంటిన్యూ చేస్తూ నేను సీరియస్ గానే అంటున్నాను.. నా కూతురును పెళ్లి చేసుకో సన్నీ అన్నట్లుగా ఆమె మళ్లీ అడిగింది. మరి సన్నీ ఇది ఎంత వరకు సీరియస్ గా తీసుకుంటాడు.. అసలు ఆమె మాటల్లో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్స్ సెలబ్రెటీలు రెగ్యులర్ గా చూస్తూనే ఉంటారు కనుక సన్నీ ఈ వంద కోట్ల విషయాన్ని కూడా మర్చి పోయే ఉంటాడు. జనాలు మాత్రం ప్రస్తుతం ఈ విషయాన్ని గురించి తెగ చర్చించుకుంటున్నారు. సన్నీ కి త్వరలోనే పెళ్లి చేయాలనుకుంటున్నట్లుగా అతడి తల్లి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కనుక 2022 లో లేదా 2023 లో అయినా సన్నీ కి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
సన్నీ కూడా పెళ్లి విషయంలో వ్యతిరేకంగా ఏమీ లేను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. వంద కోట్ల కట్నం కాకున్నా కూడా అతడికి దక్కిన క్రేజ్ కు.. అతడు ముందు ముందు చేయబోతున్న ప్రాజెక్ట్ లకు గాను ఖచ్చితంగా సన్నీ భారీ గానే కట్నం దక్కించుకోవడంతో పాటు మంచి ఫ్యామిలీ కి చెందిన అమ్మాయి అతడికి దక్కే అవకాశం ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సన్నీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటీ.. అతడు బుల్లి తెరకే పరిమితం అవుతాడా లేదంటే.. జెస్సీ మరియు ఇతర బిబి కంటెస్టెంట్స్ మాదిరిగా వెండి తెరపై కి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతాడా అనేది చూడాలి.