Begin typing your search above and press return to search.

సూర్యకు ఫేక్‌ టీజర్ల గోల వదలట్లేదు

By:  Tupaki Desk   |   3 March 2016 9:30 AM GMT
సూర్యకు ఫేక్‌ టీజర్ల గోల వదలట్లేదు
X
ఇప్పటికే మీరు ఫేస్‌ బుక్‌ పేజీల్లో.. ట్విట్టర్‌ టైమ్‌ లైనుల్లోచూసే ఉంటారు.. ఎక్కడపడితే అక్కడ కనిపిస్తోంది హీరో సూర్య కొత్త సినిమా ''24'' టీజర్‌. ఈ సినిమా టీజర్‌ ను నిజానికి మార్చి 4 సాయంత్రం.. 6 గంటలకు విడుదల చేస్తున్నాం అంటూ సూర్య మొన్ననే ప్రకటించేశాడు. మరి అఫీషియల్‌ టీజర్‌ రాకుండానే.. అసలు యుట్యూబ్‌ లో టీజర్‌ ఎలా వచ్చేసినట్లు?

అదే మరి తెలుసుకోవాల్సిందే. ఇప్పటికే పోస్టర్లను చూసి కొందరు రూమర్‌ రాజాలు ఈ సినిమా స్టోరీ పరంగా ఒక కంక్లూజన్‌ కి వచ్చేశారు. వారికి ఈ సినిమా ఎలా ఉంటుంది ఒక అవాగాహన ఉంది కాబట్టి.. అలాంటి బిట్టులు ఉన్న హాలీవుడ్‌ సినిమాల్లోని ముక్కలు తీసి.. వాటికి సూర్య గత సినిమాల్లోని క్లిప్పులన్నీ కలిపి.. ఒక బంపర్‌ టీజర్‌ ట్రైలర్‌ ఒకటి రెడీ చేశారు. ఒకవేళ అన్ని షాట్లు మీరు గుర్తుపట్టలేకపోయినా.. అదిగో అక్కడ సమంతతో కలసి సూర్య పరిగెడుతున్నాడు చూడండి.. అది ''అంజాన్‌'' (తెలుగులో 'సికందర్‌') సినిమాలోని బిట్.. అది చూస్తే వెంటనే గుర్తుపట్టేయొచ్చు.. ఇదో ఫేక్‌ ట్రైలర్‌ కమ్‌ టీజర్‌ అని.

పాపం సూర్య గత సినిమాలక కూడా.. ఇలాగే ఒరిజినల్‌ టీజర్‌ రిలీజ్‌ అవ్వకముందే ఫేక్‌ టీజర్లు రిలీజ్‌ అయ్యి నానా రచ్చా చేసేశాయి. సరే.. ఒరిజనల్‌ టీజర్‌ కోసం రేపటి వరకు వెయిట్‌ చేయండి. అంతవరకు చదువుతూనే ఉండండి తుపాకి.కామ్‌