Begin typing your search above and press return to search.
మంచి సినిమా చేస్తే ఇలా చేశారేంటి..
By: Tupaki Desk | 18 April 2016 7:30 AM GMTషారుఖ్ ఖాన్ రెండేళ్ల కిందట ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే సినిమా చేశాడు. విమర్శకులు ఆ సినిమా చీల్చి చెండాడారు. ప్రేక్షకులు సినిమా చూసి తిట్టిపోశారు. కంటెంట్ పరంగా చూస్తే అది ఓ డిజాస్టర్. కానీ బాక్సాఫీస్ లెక్కల్లో చూస్తే ఆ చిత్రం బ్లాక్ బస్టర్. తొలి రోజే ఏకంగా రూ.50 కోట్ల దాకా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పిన ఆ సినిమా ఓవరాల్ గా రూ.300 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇక గత ఏడాది ‘దిల్ వాలే’ కూడా అంతే. ఈ చిత్రానికి కూడా అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. అది కూడా చివరికి చెత్త సినిమా అన్న పేరు తెచ్చుకుంది. షారుఖ్ అలాంటి చెత్త సినిమాలు చేసినపుడు వసూళ్ల వర్షం కురిపించిన ప్రేక్షకులు.. లేక లేక ఓ మంచి సినిమా చేస్తే దాన్ని అనుకున్న స్థాయిలో ఆదరించట్లేదు.
గత శుక్రవారం రిలీజైన షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘ఫ్యాన్’.. తొలి రోజు ఇండియాలో కేవలం రూ.19 కోట్లే వసూలు చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో రెండో రోజు నుంచి కలెక్షన్లు పుంజుకుంటాయేమో అనుకుంటే.. అదేం జరగలేదు. రెండో రోజు రూ.15 కోట్లే కలెక్ట్ చేసింది ‘ఫ్యాన్’. ఓ మంచి సినిమా చేస్తే ఇలా తయారైందేంటి పరిస్థితి అని షారుఖ్ ఫీలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఐతే ఈ సినిమా మీద ప్రశంసలకైతే లెక్కే లేదు. ‘చక్ దే ఇండియా’ తర్వాత షారుఖ్ చేసిన మంచి సినిమా ఇదే అంటూ పొగిడేస్తున్నారు. క్రిటిక్స్ 4.. 4.5 రేటింగులిచ్చారు. షారుఖ్ ఫెర్ఫామెన్స్ గురించి గొప్పగా చెబుతున్నారు. ఆర్యన్ ఖన్నా అనే సూపర్ స్టార్‌గా.. ఆ స్టార్‌ను అభిమానించే గౌరవ్ అనే అభిమానిగా రెండు భిన్నమైన పాత్రల్లో అద్భుతమైన అభినయం చూపించాడు షారుఖ్ ఇందులో.