Begin typing your search above and press return to search.
'ఏజెంట్'..'లైగర్' మధ్య ఫ్యాన్ వార్!
By: Tupaki Desk | 21 April 2022 7:06 AM GMTవిజయ్ దేవరకొండ స్టార్ డమ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'అర్జున్ రెడ్డి' హిట్ తో ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు 'లైగర్' తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. పాన్ ఇండియా కేటగిరీలో 'లైగర్' రిలీజ్ అవుతుంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూర్ఇ జగన్నాధ్ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. చిత్ర నిర్మాణం లో బాలీవుడ్ దిగ్గజ నిర్మాత కరణ్ జోహర్ సైతం భాగం అవ్వడంతో 'లైగర్' లో సమ్ థింగ్ ఉందని ఫోకస్ అవుతుంది.
ఇక సినిమా హిట్ అయితే విజయ్ వేగాన్ని ఆపడం ఆసాధ్యమే. 'లైగర్' ఇలాంటి ప్రత్యేకత మధ్య రిలీజ్ అవుతుంది. అలాగే అక్కినేని వారసుడు అఖిల్ 'ఏజెంట్' కూడా పాన్ ఇండియా కేటగిరిలో రిలీజ్ అవుతుంది. ఇదొక స్పై థ్రిల్లర్. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నారు. అఖిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే 'ఏజెంట్' పై అంచనాలు పీక్స్ కి చేరాయి. సిక్స్ ప్యాక్ లుక్...స్పై థ్రిల్లర్ వంటి అంశాలు సినిమాని అమాంతం అలా పైకి లేపాయి.
అంతకుముందు 'మోస్ట్ ఎలిజ్ బుల్ బ్యాచిల'ర్ తోనూ సక్సెస్ అందుకున్నాడు. మగువల గుండెల్లా రాజుకుమారుడు అయ్యాడు. ఈ సినిమా హిట్ తో అఖిల్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు అయింది. అయితే ఇప్పుడు 'ఏజెంట్'-'లైగర్' అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. పాన్ ఇండియా కేటగిరిలో మా హీరోదే పైచేయి అవుతుందంటూ ఇద్దరి హీరోల అభిమానులు బాహాబాహీకి దిగారు.
అక్కినేని ఫ్యామిలీ ఇంట హీరోకి పోటీ ఎవరు? తనకు తానే సాటి అంటూ అఖిల్ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికి మించి 'ఏజెంట్' చిత్రానికి సూరి దర్శకత్వం వహించడాన్ని హైలైట్ చేస్తున్నారు. 'లైగర్' పై అప్పర్ హ్యాండ్ అవ్వడానికి ఇదొక రీజన్ చాలు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే అఖిల్ కెరీర్ కి తిరుగుండదు. అయితే విజయ్ ఇమేజ్ కి- అఖిల్ ఇమేజ్ కి చాలా వ్యత్యాసం ఉంది.
విజయ్ సమీపంలోఅఖిల్ ఏమాత్రం లేడని దేవరకొండ అభిమానులు అంటున్నారు. బాలీవుడ్ మెచ్చిన విజయ్ అంటూ 'అర్జున్ రెడ్డి' కి చెందిన పాత పోస్ట్ లు పెట్టి గుర్తు చేస్తున్నారు. ఇద్దరికి మధ్య ఏ మాత్రం పోలిక లేదని కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో హీరోల అభిమానుల మధ్య ఇలాంటి వివాదాలు సహజమే. ఇద్దరి హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ సమయం దగ్గర పడేసరికి ఇలాంటి హడావుడి తరుచూ చోటు చేసుకుంటుంది.
'లైగర్' తర్వాత విజయ్ పూరి దర్శకత్వంలోనే 'జనగణమన' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీ తో భారీ వార్ సన్నివేశాలతోనే పూరి నింపేసే అవకాశం ఉంది. సాధారణ కమర్శియల్ సినిమాల్లోనూ పూరి తూటాలకు పదునెక్కువ. 'జేజీఎమ్' లాంటి సినిమాని ఇంకే రేంజ్లో చూపిస్తాడో చెప్పాల్సిన పనిలేదు.