Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ మధ్య అప్రకటిత యుద్ధం షురూ
By: Tupaki Desk | 10 March 2022 3:30 AM GMT`ఆర్ ఆర్ ఆర్`.. ఈ సినిమా గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు మార్చి 25న అత్యంత భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో యావత్ దేశం మొత్తం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో వున్నాయి. కొంత మందైతే ఈ మూవీ రిజల్ట్ పై బెట్టింగులు కూడా స్టార్ట్ చేస్తున్నారట. అంతగా ఈ మూవీ క్రేజ్ వరల్డ్ వైడ్ గా పాకిపోయింది.
కీలక పాత్రలైన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, గోండు బెబ్బులి కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తుండటంతో ఈ పాత్రల్లో ఇద్దరు ఎలా నటించారు? ..
ఇంతకీ ఇద్దరి కలయిక ఎలా జరిగింది? .. చరిత్రకే తెలియని కథని రాజమౌళి ఎలా తెరపైకి తీసుకొచ్చాడు?.. ఫిక్షనల్ స్టోరీకి ఈ రెండు పాత్రలని ఎలా జోడించాడు?.. స్వాతంత్ర సంగ్రామం కోసం ఇద్దరు చేసిన త్యాగాలు ఏంటీ? అన్నది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ప్రతీ ఒక్కరిలోనే ఈ మూవీపై భారీ స్థాయిలో చర్చ జరుగుతోంది.
ఇదిలా వుంటే మెగా హీరో రామ్ చరణ్ ఫ్యాన్స్ .. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వేదికగా అప్రకటిత యుద్ధం మొదలైనట్టుగా కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. గత కొన్ని రోజులుగా నెట్టింట ఇద్దరు హీరోల మధ్య వార్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సినిమాలో మా హీరో పాత్ర కీలకంగా వుంటుదంటే లేదు లేదు మా హీరో పాత్రనే కీలకంగా వుంటుదని రెండు ఫ్యాన్స్ గ్రూపుల మధ్య చర్చ నడుస్తోందట.
ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాలో మా హీరో ప్రాముఖ్యత ఎక్కువగా వుంటుందని, రామ్ చరణ్ పాత్రని డామినేట్ చేసే స్థాయిలో వుంటుందని అంతే కాకుండా అత్యధిక శాతం తెరపై ఎన్టీఆర్ మాత్రమే కనిపిస్తారని వాదిస్తున్నారట. ఇక మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ దీనికి గట్టి కౌంటర్ ఇస్తున్నట్టుగా చెబుతున్నారు.
రామ్ చరణ్ పాత్ర, తన పెర్ఫార్మెన్స్ `ఆర్ ఆర్ ఆర్` ప్రధాన హైలైట్ గా నిలవనుందని, ఎన్టీఆర్ ని డామినేట్ చేసే రేంజ్ లో చరణ్ పాత్ర వుంటుందని వాదిస్తున్నారట.
ఈ వాదన రాను రాను అగ్లీ వార్ గా మారిందని, ఇరు వర్గాల ఫ్యాన్స్ ఒకరిని ఒకరు దూషించుకునే స్థాయికి వెళ్లిందని చెబుతున్నారు. ఇటీవల రాజమౌళి పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ సినిమాలో ఇద్దరు హీరోలకు సమాన ప్రాధాన్యత వుందని, ఎవరి పాత్రలకు వారు పర్ఫెక్ట్ గా న్యాయం చేశారని క్లారిటీ ఇచ్చారు. అయినా ఇద్దరు హీరోలకు సంబంధించిన అభిమానులు ఇలా రచ్చ చేయడం పలువురిని షాక్ కు గురిచేస్తోందట.