Begin typing your search above and press return to search.
ఆస్కార్ జాబితా కోసం డబ్బు చెల్లించారా?!
By: Tupaki Desk | 14 Aug 2022 12:30 PM GMTఆస్కార్ అవార్డుల గురించి ఎన్నడూ లేనంతగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చ సాగుతోంది. దానికి కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండడమే. అతడు ఆర్.ఆర్.ఆర్ తరపున ఉత్తమ నటుడు కేటగిరీకి నామినేట్ అయ్యేందుకు ఛాన్సుంది (పాజిబిలిటీస్ పరిశీలన) అంటూ కథనాలు వెలువడ్డాయి. పాపులర్ వెరైటీ మ్యాగజైన్ లో ఇలాంటి కథనం రావడంతో ఫ్యాన్స్ స్టన్నయిపోయారు. నిజానికి ఇలాంటి అవకాశం చాలా అరుదు. కానీ ఆర్.ఆర్.ఆర్ పేరు ఆస్కార్ బరిలో ఇప్పుడు మార్మోగుతోంది.
ఆస్కార్ 2023 జాబితాలో ఎన్టీఆర్ కి ఆస్కారం ఉందన్న అంచనాలను వెలువరించడంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. జాబితాలో ఉన్న ఏకైక ఆసియా నటుడిగా తారక్ పేరు మాత్రమే ఉంది. దీంతో నందమూరి.. మెగా అభిమానుల మధ్య ఆన్ లైన్ వార్ మొదలైంది. ఈ లిస్ట్ లో రామ్ చరణ్ పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. చాలా అంచనాలు పెట్టుకుంటే అతడి పేరు లేకపోవడమేమిటా అంటూ ఆ కోపం తారక్ పై చూపిస్తున్నారు.
సరిగమ సినిమాస్- రాఫ్తార్ క్రియేషన్స్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో RRRని పంపిణీ చేశాయి. రాఫ్తార్ క్రియేషన్స్ హక్కులలో చిన్న వాటాను కలిగి ఉంది. సినిమా విడుదలైనప్పుడు సరిగమ సినిమాస్ కు అత్యధిక వీక్షణలు వచ్చాయి.
కానీ వెరైటీ మ్యాగజైన్ రాఫ్తార్ క్రియేషన్స్ పేరును చివరి కాలమ్ లో ప్రచురించారు. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ సమయంలో రాఫ్తార్ క్రియేషన్స్ ఎన్టీఆర్ అభిమానుల వీడియోను లైక్ చేసింది. అందుకే రాఫ్తార్ క్రియేషన్స్ అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ క్లబ్ అని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎన్టీఆర్ ని ప్రాబబుల్స్ లిస్ట్ లో పెట్టడానికి వెరైటీ వాళ్లకు వారు డబ్బు చెల్లించారు.. అంటూ విమర్శిస్తున్నారు ఫ్యాన్స్.
నిజానికి 'పాజిబిలిటీ' జాబితాలో మాత్రమే ఆర్.ఆర్.ఆర్ ఉంది. నామినేట్ అవుతుందా లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం. ఈ జాబితాలో ఇంకా రిలీజ్ కాని సినిమాల పేర్లు కూడా ఉన్నాయి.
ఇది చాలా సహజం. కొన్నిసార్లు వెరైటీ లాంటి ప్రముఖ ప్రచురణల సంస్థకు చెందిన విమర్శకులు కూడా విడుదల కంటే ముందే ఆస్కార్ కి పోటీపడే సినిమాలను చూడగలరు. ఆ పేర్లను సంభావ్యతా జాబితాలో ఉంచుతారు. కేవలం డబ్బు చల్లితే అమ్మేసే అవార్డులు కావు ఆస్కార్ లు. దానికి చాలా లెక్కలు కొలతలు ఉంటాయన్నది గుర్తెరగాలి.