Begin typing your search above and press return to search.
నెట్టింట ఫ్యాన్ వార్...పవన్ కు టైమ్ లేదట..!
By: Tupaki Desk | 9 Dec 2022 5:30 PM GMTమూడున్నరేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీమేక్ మూవీ 'వకీల్ సాబ్'తో మళ్లీ కెమెరా ముందుకు రావడం తెలిసిందే. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించడం, తక్కువ టైమ్ లో పూర్తి కావడంతో పవన్ మళ్లీ రీమేక్ మూవీనే ఎంచుకున్నాడు. మలయాళ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా పవన్ 'భీమ్లానాయక్' చేశాడు. ఇది కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం స్ట్రెయిట్ స్టోరీతో 'హరి హర వీరమల్లు' మూవీలో నటిస్తున్నాడు.
క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత పవన్ కల్యాణ్ 'తేరీ' రీమేక్ లో నటించబోతున్నాడంటూ గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపత్యంలో ప్రభాస్ డైరెక్టర్, సాహో ఫేమ్ సుజీత్ తో ఓ క్రేజీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టుగా మూడు రోజుల క్రితం ఓ కాన్సెప్ట్ పోస్టర్ తో అనౌన్స్ మెంట్ చేశారు. డీవీవీ దానయ్య ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు.
ఈ ప్రకటనతో ఇది 'తేరీ' రీమేక్ కాదని స్పష్టమైంది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. పవన్ స్ట్రెయిట్ స్టోరీతో రాబోతున్నాడని హ్యాపీగా ఫీలయ్యారు. అయితే ఆ సంబరం ఎంతో సేపు నిలవలేదు. దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా వేదికగా 'పెద్ద ఉత్సాహం రాబోతోంది..వాచౌట్ దిల్ స్పేస్ గైస్' అంటూ 'గబ్బర్ సింగ్' మూవీలోని బ్రహ్మానందం సీన్ ని ట్వీట్ చేశాడు. దీంతో అసలు రచ్చ మొదలైంది. #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ 'తేరీ' రీమేక్ ని ఎట్టపరిస్థితుల్లోనూ చేయకూడదని పవన్ ఫ్యాన్స్ రచ్చ చేయడం మొదలు పెట్టారు.
ప్రతీ ఆదివారం టీవీల్లో ప్రసారం అవుతున్న 'పోలీసోడు' మూవీని మళ్లీ పవన్ తో రీమేక్ చేయడం తనకు నచ్చడం లేదని, ఇంత వరకు ఎన్నో రీమేక్ లు చేసినా ఇంతలా ఫీలవ్వలేదని, కానీ ఇప్పటికే అందరూ చూసేసిన 'తేరీ'ని రీమేక్ చేయాలని చూస్తున్నారని, నా చావుని చూసైనా 'తేరీ' రీమేక్ ని ఆపండి' అంటూ ఓ యువతి సూసైడ్ పోట్ రాసి కలకలం రేపుతోంది. నెట్టింట ఫ్యాన్స్ చేస్తున్న హంగామాపై జనసైనికులు అంటూ కొంత మంది స్పందిస్తున్నారు.
పవన్ కల్యాణ్ గారికి ప్రస్తుతం స్ట్రెయిట్ సినిమాలు చేసే సమయం లేదు. అలా చేస్తే అంగీకరించిన సినిమాలతో పాటు రాజకీయాలపై దృష్టి సారించలేరు. కాబట్టే రీమేక్ సినిమాలు చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఈ సమాధానంపై పవన్ ఫ్యాన్స్ శాంతించడం లేదు. 'తేరీ' రీమేక్ ని నిలిపివేయాల్సిందే అంటూ మండిపడుతున్నారు. మరి ఫ్యాన్స్ హంగామాపై దర్శకుడు హరీష్ శంకర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.