Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ డిజాస్టర్ రాజా అంటున్నారే!
By: Tupaki Desk | 30 July 2022 8:30 AM GMTమాస్ మమారాజా రవితేజ టైమ్ అస్సలు బాగా లేదు. గత కొంత కాలంగా తన మార్కు సినిమాలకు దూరమవుతున్నాడు. భారీ అంచనాలు పెట్టుకున్న తన అభిమానుల్ని ప్రతీ సారి తీవ్రంగా నిరాశ పరుస్తూరు వస్తున్నాడు. హీరోగా తనదైన జోరుని చూపిస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తుంటే వరుస ఫ్లాపులతో తన ఫామ్ ని కోల్పోతూ నిరుత్సాహ పరుస్తున్నాడు. కిక్ 2 నుంచి మాస్ మహారాజా రవితేజ డిజాస్టర్ ల పరంపర కొనసాగుతోంది.
మధ్యలో వచ్చిన `బెంగాల్ టైగర్`, రాజా ది గ్రేట్ వంటి చిత్రాలు ఫరావాలేదనిపించినా ఆ తరువాత కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చి `టచ్ చేసి చూడు` అంటూ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాడు. ఈ మూవీ ఏ రేంజ్ డిజాస్టర్ అంటే మళ్లీ దర్శకుడికి సినిమా లేనంతగా డిజాస్టర్ గా నిలిచి షాకిచ్చింది. ఇక ఈ సినిమాతో అయినా ఆగుతుందనుకున్న డిజాస్టర్ ల పరంపర నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కోరాజా.. వరకు కొనసాగుతూ వచ్చింది. ఇలా సినిమా మారుతోందే కానీ డిజాస్టర్ మూవీ మాత్రం మారడం లేదు. కంటిన్యూ అవుతూనే వుంది.
ఒక దశలో ఇక మాస్ మహారాజా రవితేజ దుకాణం సర్దేయాల్నిందేనా అనే అనుమానాలు వ్యక్త మయ్యాయి. అప్పుడు పడింది `క్రాక్`. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన అ మూవీ ఈ ఇద్దరి కెరీర్ కి కీలకంగా నిలిచింది. ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి మాస్ రాజా ని మళ్లీ ఫామ్ లోకి తీసుకొచ్చింది. ఈ సినిమా సాధించిన విజయంతో రవితేజ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం మొదలైంది. ఇక నుంచి అన్ని బ్లాక్‌బస్టర్ రే అని, రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని సంబరాలు చేసుకున్నారు. అయితే ఆ సంబరాలు ఎన్నో రోజులు నిలవలేదు.
`ఖిలాడీ` రూపంలో మాస్ రాజా మరో డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకుని ఫ్యాన్స్ కు షాకిచ్చాడు. వెంటనే `రామారావు ఆన్ డ్యూటీ`తో డ్యూటీ ఎక్కాలనుకున్నాడు. ఫ్యాన్స్ కూడా టీజర్, ట్రైలర్ చూసి ఈ సినిమాతో మాస్ రాజా మళ్లీ సక్సెస్ డ్యూటీ ఎక్కేస్తాడని భావించారు. భారీగా అంచనాలు పెట్టుకున్నారు. కానీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన `రామారావు ఆన్ డ్యూటీ` వారి నమ్మకాన్ని వమ్ముచేసింది. వారి సహనాన్ని దెబ్బతీసింది. `క్రాక్` ఎందుకు ఆడిందో.. ఆ తరువాత చేసినవి.. అంతకు ముందు చేసినవి ఎందుకు ఆడలేదో రవితేజ విశ్లేశించుకోలేపోయాడు.
విమర్శని పెద్దగా పట్టించుకోనని మీడియా సమావేశాల్లో స్పష్టం చేస్తూ కామెంట్ లని లైట్ గా తీసుకుంటానని చెబుతూ వస్తున్న రవితేజ కనీసం ఆయన అభిమానులు ఏం కోరుకుంటున్నారో కూడా వినడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. `రామారావు ఆన్ డ్యూటీ` సినిమా చూసిన ఓ అభిమాని ఏకంగా రవితేజకు ఓపెన్ లెటర్ రాయడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంతో తప్పులేదని, కానీ టాలెంట్ లేని వాళ్లకు అవకాశాలు ఇవ్వడమే బాగాలేదన్నాడు. రవితేజ కు చైల్డ్ హుడ్ నుంచి అభిమానిననిచ అయితే మునుపటి రవితేజ తనలో కనిపించడం లేదన్నాడు.
గుడ్డిగా ప్రాజెక్ట్ లని చేస్తూ పోతున్నాడే కానీ జాగ్రత్తగా ఆలోచించి సినిమాలు చేయడం లేదని మండిపడ్డాడు. ఇక ఐమాక్స్ థియేటర్ ముందు ఓ అభిమాని ఏకంగా రవితేజతో సినిమా చేసిన దర్శకుడిపై నిప్పులు చెరిగాడు. సినిమా కూడా తీయడం చేతకాదని, అలాంటి వాళ్లని నమ్మి రవితేజ సినిమాలు ఎందుకు చేస్తున్నాడని ప్రశ్నించాడు. ఒక పాట లేదు.. నేపథ్య సంగీతం లేదు.. ఆకట్టుకునే ఫైట్ లేదు.. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లు అవుతున్నా మా లాంటి ఫ్యాన్స్ మాట వినడం లేదని వాపోయాడు.
ఈ అభిమానులు ఆక్రోశం, ఆవేదన విన్న వాళ్లంతా మస్ మహారాజా ఫ్యాన్స్ మాట కాస్త వినవయ్యా!.. మాస్ మహారాజా కాదయ్యా డిజాస్టర్ రాజా అంటున్నారయ్యా అని కామెంట్ లు చేస్తున్నారు. ఇదిలా వుంటే రవితేజ తాజాగా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ మూవీకి శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నాడు.