Begin typing your search above and press return to search.
#PSK25కు ఫ్యాన్సీ ఆఫర్
By: Tupaki Desk | 6 Oct 2017 4:30 AM GMTఎదురుదెబ్బ తగలడం.. కింద పడటం.. తిరిగి లేవడం ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో మామూలే. ఓ సినిమా ద్వారా నష్టపోయినా తిరిగి ఇంకో సినిమా హిట్ కొడితే పాత నష్టం పూడ్చుకోవచ్చనే లెక్కలతో ముందడుగు వేసేవారెందరో. ఈ ఆశే ఇండస్ట్రీకి కొత్త రికార్డులకు కారణమవుతుంది. ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ పై ఎన్నో ఆశలతో డిస్డ్రిబ్యూటర్లు భారీ మొత్తంతో హక్కులు తీసుకున్నారు. సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో పెట్టుబడులు తిరిగి వస్తాయో రావో చెప్పలేని పరిస్థితి.
స్పైడర్ తర్వాత దాదాపు అదే రేంజ్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న చిత్రం పవన్ కళ్యాన్ 25వ సినిమా. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ క్రేజీ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం భారీ మొత్తమే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఆఫర్ చేస్తున్నారట. నెల్లూరు ఏరియా రైట్స్ కోసం ఓ డిస్ట్రిబ్యూటర్ రూ. 4.05 కోట్లు ఆఫర్ చేశారని టాక్. ఇంతవకు ఈ ఏరియాలో ఓ మూవీకి ఇంత ఫ్యాన్సీ మొత్తం ాఫర్ ఇవ్వడం ఇదే మొటిసారి.
ఈ రోజుల్లో సినిమాకు డివైడ్ టాక్ వస్తే పెట్టుబడులు తిరిగి రాబట్టుకోవడం కష్టమే. స్పైడర్ తరవాత పవన్ కళ్యాణ్ సినిమా నిర్మాత కాస్త కలవరానికి గురైనా ప్రస్తుత పరిణామాలు ఆశాజనకంగానే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లలో ఈ కాన్ఫిడెన్స్ కు మూల కారణం త్రివిక్రమ్ డైరెక్షన్ పై ఉండే నమ్మకం.. పవన్ కు అభిమానుల్లో ఉండే క్రేజేనని చెప్పక తప్పదు. చూద్దాం.. ఈ సినిమా క్రేజ్ మరింత పెరగనుందో.