Begin typing your search above and press return to search.

ఐష్ రీఎంట్రీ .. గ్రాండ్‌ స‌ర్‌ ప్రైజ్ ట్రీట్‌!

By:  Tupaki Desk   |   3 Aug 2018 12:41 PM GMT
ఐష్ రీఎంట్రీ .. గ్రాండ్‌ స‌ర్‌ ప్రైజ్ ట్రీట్‌!
X
2016లో క‌ర‌ణ్ జోహార్ `ఏ దిల్ హై ముష్కిల్` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది మాజీ విశ్వ‌సుంద‌రి ఐశ్వ‌ర్యారాయ్‌. రీఎంట్రీ ఫ‌ర్వాలేద‌ని టాక్ వ‌చ్చినా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయితే కాదు. ఆ త‌ర్వాత‌ మ‌ళ్లీ రెండేళ్ల‌కు `ఫ‌నే ఖాన్‌` చిత్రంతో అభిమానుల్ని అల‌రించేందుకు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. నేడు ఈ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజైంది. ఐశ్వ‌ర్యారాయ్‌ - అనీల్ క‌పూర్‌ - రాజ్‌ కుమార్‌ రావ్ కాంబినేష‌న్‌ లో వ‌చ్చిన అర్థ‌వంత‌మైన ఫ‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్ ఈ చిత్రం అన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో ఐశ్వ‌ర్యారాయ్ బేబి సింగ్ అనే క‌థానాయిక పాత్ర‌లో న‌టించారు. ఇంకా చెప్పాలంటే రియ‌ల్ లైఫ్ పాత్ర‌నే తెర‌పైనా చూపించారు. అందాల ఐశ్వ‌ర్యారాయ్‌ ని కిడ్నాప్ చేసే నిరుద్యోగుల పాత్ర‌లో అనీల్ క‌పూర్‌ - రాజ్‌ కుమార్ రావ్ క‌నిపిస్తారు. ఇదివ‌ర‌కూ రిలీజైన ట్రైల‌ర్‌ లోనే ఈ కిడ్నాప్ డ్రామాని ఎలివేట్ చేశారు మేక‌ర్స్‌. ఇక‌పోతే ఐశ్వ‌ర్యారాయ్‌- రాజ్‌ కుమార్ రావ్ రొమాన్స్ అద్భుతంగా ఉంద‌ని స‌మీక్ష‌కులు ప్ర‌శంసించారు. పెర్ఫెక్ట్ కాస్టింగ్‌ - పెర్ఫెక్ట్ పెర్ఫామెన్సెస్‌ తో ఫ‌నే ఖాన్ మెప్పించింద‌ని, ఐష్ రీఎంట్రీలో చ‌క్క‌ని విజ‌యం అందుకుంద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

ఇక ఈ సినిమాలో అనీల్ క‌పూర్ ఓ మ్యుజిషియ‌న్ కావాల‌నుకుంటాడు. ష‌మ్మీ క‌పూర్‌ ని పిచ్చిగా ఆరాధించేవాడిగా క‌నిపించాడు. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన ఓ రీమిక్స్ పాట‌లో ష‌మ్మీక‌పూర్ ఆహార్యంతో అనీల్ క‌పూర్ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సీనియ‌ర్ హీరో పెర్ఫామెన్స్‌ కి క్రిటిక్స్ చ‌క్క‌ని మార్కులేశారు. ఓవ‌రాల్‌ గా ఫ‌నే ఖాన్ ఈ సీజ‌న్‌ లో హిట్ కొట్టిన‌ట్టేన‌న్న టాక్ తొలిరోజే వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఆంగ్ల వెబ్‌ సైట్లు ఈ సినిమాకి 3 రేటింగ్ ఇవ్వ‌డం మూవీకి ప్ల‌స్ కానుంది.