Begin typing your search above and press return to search.

సాయి పల్లవి కథ ఏంటో ఏం అర్థం కావడం లేదు..!

By:  Tupaki Desk   |   15 Jun 2022 7:40 AM GMT
సాయి పల్లవి కథ ఏంటో ఏం అర్థం కావడం లేదు..!
X
లేడీ పవర్ స్టార్‌ అనే బిరుదుకు ఏమాత్రం తక్కువ కాదు అనేంతగా ఫాలోయింగ్‌ ను దక్కించుకున్న ముద్దుగుమ్మ సాయి పల్లవి. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ అమ్మడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్‌ కు తగ్గట్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేయడం లేదు. ఆ విషయంలో సాయి పల్లవి పై అభిమానులు చాలా అసంతృప్తితో ఉన్నారు.

పవన్‌ కళ్యాణ్ కనుక సినిమాల విషయంలో అటు ఇటు అన్నట్లుగా ఉన్నట్లుగా సాయి పల్లవి కూడా సినిమాల ఎంపిక విషయంలో తేల్చుకోలేక పోతుందా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

సాయి పల్లవి ప్రస్తుతం విరాటపర్వం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. ఆ సినిమా తర్వాత సాయి పల్లవి చేయబోతున్న సినిమా ఏది అంటే సమాధానం లేదు. ఒక పాన్ ఇండియా సినిమా అంటూ గార్గిని చూపిస్తున్నారు. ఆ సినిమా తెలుగు సినిమా కాకపోవడంతో తెలుగు ప్రేక్షకులు సాయి పల్లవి తదుపరి సినిమా ఎప్పుడు అన్నట్లుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పటి వరకు సాయి పల్లవి తదుపరి సినిమా విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. అయిదు నుండి పది మంది దర్శక నిర్మాతలు గత ఆరు నెలలుగా సాయి పల్లవి ని కలిశారట. కాని వారిలో ఏ ఒక్కరికి కూడా సాయి పల్లవి ఓకే చెప్పలేదట. కేవలం తెలుగు నుండే కాకుండా ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తున్నా ఈ అమ్మడు పెద్దగా పట్టించుకోవడం లేదు అనే టాక్ వినిపిస్తుంది.

విరాటపర్వం సినిమా తర్వాత సాయి పల్లవి నటనకు కాస్త గ్యాప్ తీసుకునే అవకాశం ఉందని కొందరు భావిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సాయి పల్లవి మంచి కథల కోసం వెయిట్‌ చేస్తుందని... తన మనసుకు నచ్చే కథలు వస్తే ఆమె నటిస్తుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఆమె నుండి ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు వస్తాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అభిమానులు మాత్రం సాయి పల్లవి కథ ఏంటో ఏం అర్థం కావడం లేదు. ఆమె కొత్త సినిమాలకు ఎందుకు సైన్ చేయడం లేదు.. కొత్త సినిమాల విషయంలో ఆమె నిర్ణయం ఏంటీ అనే విషయంలో స్పష్టత లేక జుట్టు పీక్కుంటున్నారు. సోషల్‌ మీడియాలో సాయి పల్లవి టాపిక్ వస్తే చాలు ఎప్పుడు సాయి పల్లవి కొత్త సినిమా ను ప్రకటిస్తుంది అంటూ చర్చ మొదలవుతుంది.