Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్.. చరణ్ నెక్ట్స్ చిత్రాలకు కండీషన్ పెట్టి ఓకే చెప్పిన జక్కన్న
By: Tupaki Desk | 11 Feb 2020 9:30 PM GMTరాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాన్ని మొదలు పెట్టిన సమయంలో జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ ను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కాని జక్కన్న తాను పెట్టుకున్న టార్గెట్ ను ఎప్పుడు రీచ్ అవ్వలేదు. తాజాగా మరోసారి అలాగే అయ్యింది. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం అనుకున్న సమయం కంటే ఆలస్యం సాగుతోంది. దాంతో సినిమాను జులై 30 2020న కాకుండా వచ్చే ఏడాదిలో సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా అంటే ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఈ ఏడాదిలో మరే సినిమాకు కమిట్ అయ్యే అవకాశాలు లేవని అభిమానులు ఒకింత నిరుత్సాహంగా ఉన్నారు.
చరణ్.. ఎన్టీఆర్ అభిమానులకు ఆనందం కలిగించే విషయంను జక్కన్న చెప్పుకొచ్చాడు. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ ఏప్రిల్ తో పూర్తి అవ్వనుంది. సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత అంటే మే నుండి వేరే ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు అంటూ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు జక్కన్న ఓకే చెప్పాడట. షూటింగ్ ముగిసిన తర్వాత నిర్మాణానంతర కార్యక్రమాలకు కావాల్సినప్పుడు టైం ఇస్తూ నవంబర్ వరకు అంటే ఏడు నెలల పాటు ఇతర సినిమాలు చేసుకోవచ్చు అన్నాడట.
జనవరిలో సినిమా విడుదల కావాల్సి ఉంది కనుక డిసెంబర్ మొదటి వారం నుండే ప్రమోషన్స్ మొదలు పెట్టాలని.. అందుకే డిసెంబర్ మరియు జనవరి లో షూటింగ్స్ లేకుండా చూసుకోవాలంటూ ఈ ఇద్దరు హీరోలకు జక్కన్న కండీషన్ పెట్టినట్లుగా సమాచారం అందుతోంది. వీరిద్దరు హీరోలు జక్కన్న ఇచ్చిన ఆ టైంలో సినిమాను చేసుకోవాల్సి ఉంటుంది.
ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్ తో సినిమాను చేసేందుకు కమిట్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. చరణ్ మాత్రం చిరు 152 చిత్రంలో చిన్న పాత్ర చేయబోతున్నాడు. ఆయన హీరోగా జర్సీ దర్శకుడు గౌతమ్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరిద్దరి తర్వాత ప్రాజెక్ట్ ల గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతికి ఆర్‌ఆర్‌ఆర్ తో వచ్చి ఆ వెంటనే సమ్మర్ లో ఈ ఇద్దరు కూడా వేరు వేరు సినిమాల తో మళ్లీ వచ్చే అవకాశం ఉంది.