Begin typing your search above and press return to search.
'భీమ్లా నాయక్' నుంచి అప్ డేట్స్ లేకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం!
By: Tupaki Desk | 31 Jan 2022 4:26 AM GMTపవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా, మల్టీ స్టారర్ మూవీగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందింది. సితార బ్యానర్ పై ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. కొంతకాలం క్రితం మలయాళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ 'భీమ్లా నాయక్'గా కనిపించనున్నాడు. ఇక డేనియల్ శేఖర్ పాత్రలో రానా నటించాడు. ఈ ఇద్దరి ఇగో చుట్టూ తిరిగే కథ ఇది. నువ్వా? నేనా? తేల్చుకోవలసిందే అనే రూట్లో ఈ కథ నడుస్తుంది.
ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అభిమానుల్లో విపరీతమైన ఉత్సాహాన్ని పెంచాయి. పవన్ లోని దూకుడే ఈ పాత్రలో కనిపించడం .. పైగా అది పవన్ కి ఇష్టమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర కావడంతో అభిమానులు అంచనాలు పెంచుకుంటూ వెళుతున్నారు. ఇక రానా విషయానికి వస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర అనే టాక్ వినిపిస్తోంది. 'భీమ్లా నాయక్'ను ఢీ అంటే ఢీ అంటూ తలపడే ఈ పాత్ర రానా కెరియర్లో గుర్తుపెట్టుకోదగినది అవుతుందని అంతా భావిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. జనవరి 12వ తేదీని ఖరారు చేసుకున్నారు కూడా. అయితే 'ఆర్ ఆర్ ఆర్' వస్తుందని చెప్పేసి రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం కష్టమేననే టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ఆ రోజున శర్వానంద్ సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్లు బయటికి వచ్చాయి. పవన్ సినిమా ఆ రోజున బరిలో ఉంటే, శర్వానంద్ సినిమా వచ్చే సాహసం చేయదు.
'భీమ్లా నాయక్' సినిమా ఆ రోజున థియేటర్లకు రావడం లేదనే అనుమానం ఈ విషయం కారణంగానే మరింత బలపడింది. కానీ 'భీమ్లా నాయక్' మేకర్స్ నుంచి మాత్రం స్పష్టత రావడం లేదు. అలా అని చెప్పేసి అప్ డేట్స్ రావడం లేదు. దాంతో పవన్ అభిమానులు తీవ్రమైన అసహనానికి లోనవుతున్నారు. ఈ సినిమా నుంచి అప్ డేట్స్ వదలాల్సిందే అనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. #We Want Bheemla Nayak Upadate అంటూ ఉపయోగిస్తున్న హ్యాష్ టాగ్ పెద్ద ఎత్తున్న వైరల్ అవుతోంది. మరి అభిమానుల్లో ఆత్రుతను అర్థం చేసుకుని మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి.