Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో: చీర చిక్కుకుంది కానీ మ్యానేజ్ చేసింది!
By: Tupaki Desk | 13 Dec 2022 3:59 PM GMTట్యాలెంటెడ్ నటి విద్యాబాలన్ ఇటీవలే ముంబైలో జరిగిన ఒక పార్టీకి భర్త సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో కలిసి హాజరయ్యారు. అక్కడ ఊహించని రీతిలో కెమెరా కంటికి చిక్కింది. ఓ వైపు కెమెరాలు తనను కవర్ చేస్తుండగా తన చీరకొంగు పార్టీకి హడావుడిగా ఎటెండవుతున్న వేరొక అతిథి చేతికి అనుకోకుండా చిక్కుకుంది. అది చూడటానికి ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశాన్ని తలపించినా కానీ.. అది వాంచితంగా జరిగినది కాదని అర్థమవుతుంది. అది ఊహించనిది. అతడు బాలన్ హబ్బీ సిద్ధార్థ్ రాయ్ కపూర్ కి షేక్ హ్యండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ తన చేతికి బాలన్ చీర కొంగు చిక్కుకుంది. దాంతో అక్కడ ఆ సన్నివేశం కెమెరాల్లో బంధీ అయ్యింది. ఇప్పుడు అది యువతరంలో వైరల్ గా మారుతోంది.
వార్డ్ రోబ్ మాల్ ఫంక్షన్.. ప్యారిస్ ఫ్యాషన్ షోలో మొదలైన ఈ వ్యవహారం ముంబై ర్యాంప్ షోలకు కూడా బాగానే వర్కవుటైంది. పొరపాటున దుస్తులు జారడం వేరు.. కానీ కావాలనే దుస్తులను చేజార్చుకోవడంగా మార్చి పబ్లిసిటీ కొట్టేయడం అలవాటైంది. కానీ ఇప్పుడు ఊహించని ఘటన ఇది. దీనిని సీనియర్ నటి బాలన్ ఎంతో సమర్థంగా మ్యానేజ్ చేయడం ఈ వీడియోలో కనిపించింది.
ఇటీవలే ఓ ఇంటి వారైన గునీత్ మోంగా- సన్నీ కపూర్ జంట కాక్ టెయిల్ పార్టీకి నటి విద్యాబాలన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విద్యా తన భర్త-నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్ తో కలిసి వచ్చారు. రెడ్ కార్పెట్ నుండి ఆమె వీడియో తాజాగా ఆన్ లైన్ లో కనిపించింది. అక్కడ ఆమె తన భారీతనం నిండిన చీరను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ కనిపించింది. ఈ పార్టీలో విద్య నలుపు-ఎరుపు మిశ్రమ వర్ణం ఫ్లోరల్ చీరతో మ్యాచింగ్ బ్లౌజ్ ధరించింది. ఆమె భర్త సిద్ధార్థ్ పూర్తిగా నలుపు రంగు సూట్ లో కనిపించారు. విద్య చీరకట్టు ఆ క్షణం `డర్టీ పిక్చర్` లుక్ ని అభిమానులకు గుర్తు చేసింది. ఈ సినిమాలో బోల్డ్ ఐటమ్ గాళ్ సిల్క్ స్మిత పాత్రలో విద్యా నటించింది. ఓ పాటలో విద్యా చీరకట్టును తిరిగి తాజా ఈవెంట్ స్ఫురణకు తెచ్చింది.
ఈ వీడియో విడుదల కాగానే.. ఒక అభిమాని స్పందిస్తూ సూటిగా ``డర్టీ పిక్చర్ మూవీ`` అని కామెంట్ చేశాడు. మరొక నెటిజనుడు వ్యాఖ్యానిస్తూ..``దేవునికి ధన్యవాదాలు.. వారు డర్టీ పిక్చర్ పాటను ప్లే చేయలేదు`` అని వ్యాఖ్యను జోడించారు. సన్నివేశాన్ని చక్కగా మ్యానేజ్ చేసినందుకు బాలన్ ను `బిందాస్ నటి` అంటూ కీర్తించాడో అభిమాని.
ఈ పార్టీకి విద్యతో పాటు పలువురు సినీప్రముఖులు కూడా హాజరయ్యారు. దర్శకనిర్మాత కరణ్ జోహార్- విశాల్ భరద్వాజ్- ఏక్తా కపూర్ -సోనాలి బింద్రే - నేహా ధూపియా కూడా ముంబైలో జరిగిన ఈ కాక్ టైల్ పార్టీకి హాజరయ్యారు.
విద్యాబాలన్ 2012లో ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ వేడుకలో సిద్ధార్థ్ ను వివాహం చేసుకుంది. కరణ్ జోహార్ ఈ జంట కోసం మన్మథుడి పాత్రను పోషించానని గతంలో వెల్లడించాడు. ట్వింకిల్ ఖన్నాతో సంభాషణ సందర్భంగా.. కరణ్ పై ఆసక్తికర కామెంట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంది. అతడు బాలీవుడ్ సిమా తపారియా అని ట్వింకిల్ వ్యాఖ్యానించింది.
ట్వింకిల్ కరణ్ జోహార్ తో మాట్లాడుతూ-``మీరు సినిమా వ్యాపారానికి సిమా ఆంటీ లాంటి వారు. మీరు ఇలా `మ్యాచ్ మేకింగ్`(జంటలను కలపడం) చేస్తూ ఉండండి. మీ నాన్న కూడా అదే పని చేసారు. నేను వహీదా రెహమాన్ తో మాట్లాడుతున్నప్పుడు మీ తండ్రి తన పెళ్లిని నిర్ణయించుకున్నారని జంటలను ఒకచోట చేర్చడానికి జీన్స్ పనికి వచ్చిందని కరణ్ పై పంచ్ లు వేసింది ట్వింకిల్.
నిజానికి సిద్ధార్థ్ కపూర్ ను విద్యాబాలన్ కు పరిచయం చేసిన విషయాన్ని కరణ్ ఈ వేదికపై గుర్తు చేసుకున్నాడు. ``నా బాధ్యతను నేను తీసుకుంటాను. ఇలా చేయడం నాకు చాలా సంతోషం. ఇది నా జీవిత ఎజెండాలో ఒకటి. ఒకరోజు విద్య (బాలన్) నాకు ఫోన్ చేసింది. తన 12వ వార్షికోత్సవం రోజున.. నేను ఆమెను సిద్ధార్థ్ రాయ్ కపూర్ కి పరిచయం చేశాను. సినిమాకి సంబంధించిన ఫీడ్ బ్యాక్ కంటే ఈ కాల్ నా హృదయాన్ని ఎంతగానో తాకింది`` అని ఆయన తెలిపారు. విద్య చివరిగా జల్సాలో షెఫాలీ షాతో కలిసి నటించింది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.