Begin typing your search above and press return to search.
నెల దాటినా వేల మంది బారులు తీరుతున్నారు
By: Tupaki Desk | 7 Dec 2021 6:52 AM GMTకన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాత్మరణం ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా అభిమానులకు.. సినీ వర్గాల వారికి మరియు మీడియా వర్గాల వారికి కన్నీరు మిగిల్చింది. ఆయన మృతి చెంది ఆరు వారాలు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆయన జ్ఞాపకాల్లోనే అభిమానులు ఉన్నారు.
ఇంకా ఆయన్ను తల్చుకుంటూ కాలం గడుపుతున్నారు. ప్రతి ఒక్క అభిమాని కూడా గుండెలో గూడు కట్టుకున్న ఆవేదన దిగ మింగుకుంటూ ఉంటే మరి కొందరు ప్రాణ త్యాగంకు కూడా సిద్దం అవుతున్నారు. అప్పు లేని ఈ లోకంలో తాము ఉండలేము అంటూ కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అంతటి అభిమానులు ఉన్న అప్పు ను చివరి చూపు చూడలేని వారు ఆయన సమాధిని అయినా చూడాలని కోరుకుంటున్నారు.
కంఠీరవ స్టూడియోలో ఏర్పాటు చేసిన పునీత్ రాజ్ కుమార్ సమాధి వద్దకు ప్రతి రోజు వేల సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. మొన్న ఆదివారం ఒక్క రోజే దాదాపుగా 35 వేల మంది అభిమానులు బారులు తీరి అప్పు సమాధిని సందర్శించారని అంటున్నారు. వీకెండ్స్ లోనే కాకుండా వీక్ డేస్ ల్లో కూడా ఈ సంఖ్య తగ్గడం లేదు.
వేల సంఖ్యలో గత కొన్ని వారాలుగా వస్తూనే ఉన్నారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు భద్రత ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. వస్తున్న అభిమానుల సౌకర్యార్థం కంఠీరవ వర్గాల వారు ఏర్పాట్లు చేశారు. వచ్చే ప్రతి ఒక్క అభిమానికి కూడా సమాధి సందర్శణ అవకాశం కల్పిస్తున్నట్లుగా బెంగళూరు మీడియా వర్గాల వారు చెబుతున్నారు.
పునీత్ రాజ్ కుమార్ మృతి విషయం ప్రతి ఒక్కరికి కన్నీరును మిగిల్చింది. ఆయన మృతి చెందిన విషయం తెల్సిన వెంటనే తెలుగు హీరోలు పలువురు ఆయన్న చివరి చూపు చూసేందుకు వెళ్లారు. ఆ సమయంలో వీలు పడని వారు ఆ తర్వాత వెళ్లి పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
పునీత్ రాజ్ కుమార్ మృతి దేశ వ్యాప్తంగా సినీ అభిమానులకు షాక్ అనడంలో సందేహం లేదు. కన్నడ సినీ అభిమానులు గొప్ప స్టార్ ను కోల్పోయారు. తండ్రి వారసత్వంను పునికి పుచ్చుకుని స్టార్ డమ్ దక్కించుకున్న పునీత్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకుంటున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన చనిపోవడం అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది.