Begin typing your search above and press return to search.

మెగా మాస్ సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

By:  Tupaki Desk   |   29 Dec 2022 5:30 AM GMT
మెగా మాస్ సాంగ్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 'వాల్తేరు వీర‌య్య' రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డ‌టంతో యూనిట్ ప్ర‌చారంపై దృష్టి పెట్టిన సంగ‌తి తెలిసిందే. పోటీగా వీర‌సింహారెడ్డి కూడా ఉండ‌టంతో వీర‌య్య‌ని పెద్ద ఎత్తున ప్ర‌మోట్ చేస్తున్నారు. కేవ‌లం ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లో మాత్ర‌మే క‌నిపించే స్టార్లు ఇప్పుడు ముందొస్తు వేడుక‌కు ముందే ఓ మీడియా మీట్ ని ఏర్పాటు చేసారంటే? సినిమా విష‌యంలో మేక‌ర్స్ ఎంత సీరియ‌స్ గా ఉన్నార‌న్న‌ది అద్దం ప‌డుతుంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన వీర‌య్య ప్ర‌చార చిత్రాలు సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చాయి. ఓ వేడుక‌లో చిరంజీవి సైతం సినిమాని అంత‌కంత‌కు పైకి లేపే ప్ర‌య‌త్నం చేసారు. ఇది మాస్ క‌మ‌ర్శియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ అయినా అద్భుత‌మైన ఎమోష‌న్ ప్రధానంగా హైలైట్ అవుతుందన్నారు. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌..చిరు స‌వ‌తి సోద‌రుడి పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అత‌ని పాత్ర‌కు చాలా ప్రాముఖ్య‌త ఉంది. క‌థ‌ని ట‌ర్న్ చేయ‌డంలో అతి కీల‌క‌మైన పాత్ర అది. అయితే ఇంత వ‌ర‌కూ ఈ కాంబో గురించి పెద్ద‌గా విష‌యాలేవి బ‌య‌ట‌కు తీసుకురాలేదు. ఇద్ద‌రి మ‌ధ్య కాంబినేష‌న్ స‌న్నివేశాలు ఎలా ఉంటాయ‌న్న‌ది కూడా లీక్ చేయ‌లేదు. తాజాగా సంగీత ద‌ర్శ‌కుడు దేవి శ్రీ ప్ర‌సాద్ ఇద్దరు స్టార్స్ ట్యాగ్‌లను కలిగి ఉన్న #MegaMass అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్లడించారు.

చిరు-ర‌వితేజ‌ల‌పై కంపోజ్ చేసిన సాంగ్ ని ఉద్దేశించి ఈ ట్యాగ్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తుంది. న్యూ ఇయ‌ర్ కానుక‌గా ఈ పాట‌ని జనవరి 1వ తేదీన (డిసెంబర్ 31 సాయంత్రం కావచ్చు) ఈ 'మెగామాస్' పాటను ఆవిష్కరించనున్నారు. ఈ పాట బాగా వచ్చిందని విజువల్ గానూ పాట హైలైట్ అవుతుంద‌ని తెలిపారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్రఫీ పాట‌ని నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్తుంద‌ని ధీమా వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్రస్తుతం వీరయ్య బృందం ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియోలు మరియు ఇతర ప్రోమోలను సిద్ధం చేసే ప‌నిలో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ మధ్య కాలంలో చిరంజీవి మరో హీరోతో జోడీ కట్టినప్పుడల్లా ఆ పాట చార్ట్‌బస్టర్ అవుతుంది.

ఇప్ప‌టికే త‌న‌యుడు రామ్ చరణ్‌తో కలిసి రెండుసార్లు స్టెప్స్ అందుకున్నారు. 'అమ్మడు కుమ్ముడు' -'భలే భలే బంజారా' కోసం ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేసారు. ఇప్పుడు చిరంజీవి మాస్ రాజాతో చేతులు క‌ల‌ప‌డం విశేషం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.