Begin typing your search above and press return to search.

అన్న + వ‌దిన = బెస్ట్ క‌పుల్.. ఫ్యాన్ ప్ర‌శంస‌

By:  Tupaki Desk   |   2 Oct 2022 2:30 PM GMT
అన్న + వ‌దిన = బెస్ట్ క‌పుల్.. ఫ్యాన్ ప్ర‌శంస‌
X
అపోలో హాస్పిట‌ల్స్ వైస్ చైర్ ప‌ర్స‌న్ గా.. అపోలో హెల్త్ మ్యాగ‌జైన్ నిర్వాహ‌కురాలిగా మెగా కోడ‌లు ఉపాస‌న‌కు సోష‌ల్ మీడియాల్లో బోలెడంత గుర్తింపు ఫాలోయింగ్ ఉంది. వీట‌న్నిటినీ మించి త‌న‌దైన వ్య‌క్తిత్వం.. దూసుకుపోయే త‌త్వం.. ఎంట‌ర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ తో అంద‌రినీ త‌న‌వైపు తిప్పేసుకున్నారు ఉపాస‌న‌. భ‌క్తి ధార్మిక సేవ‌లో ఇత‌ర సేవాకార్య‌క్ర‌మాలతోనూ ఉపాస‌న ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తున్నారు.

ఉపాస‌న రామ్ చ‌ర‌ణ్ సోష‌ల్ మీడియాల్లో త‌న వ్య‌క్తిగ‌త వృత్తిగ‌త అంశాల‌ను ప్రస్థావిస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడూ ట‌చ్ లో ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఉపాస‌న డౌన్ టు ఎర్త్ నైజానికి అభిమానులు ఫిదా అయిపోతుంటారు.

తాజాగా హ‌బ్బీ చ‌ర‌ణ్ తో క‌లిసి ఉన్న ఓ ఫోటోని ఉపాస‌న షేర్ చేయ‌గా మెగాభిమానుల్లో వైర‌ల్ గా మారింది. ఇందులో బ్లాక్ బ్లేజ‌ర్ లో చ‌ర‌ణ్ ఎంతో స్మార్ట్ గా క‌నిపించ‌గా బ్లూ క‌లర్ డిజైన‌ర్ దుస్తుల్లో ఉపాస‌న ఎంతో అందంగా క‌నిపిస్తున్నారు. జంట ఎంతో ముచ్చ‌ట‌గా ఉంది. దీనికి ఫెస్టివ్ వైబ్స్ అంటూ అంద‌మైన క్యాప్ష‌న్ ని ఉపాస‌న ఇచ్చారు. ఈ ఫోటోకి నెటిజ‌నుల నుంచి అద్భుత స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అన్న + వ‌దిన = బెస్ట్ క‌పుల్.. అని ఒక ఫ్యాన్ ప్ర‌శంస కురిపించ‌గా.. బ్లాక్ అండ్ బ్లూ జంట‌ కాంబినేష‌న్ అదిరింది! అంటూ మ‌రో అభిమాని ప్రేమ‌ను కురిపించాడు.

నిన్న‌టిరోజున అల్లు రామ‌లింగ‌య్య గారి శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో చ‌ర‌ణ్ -ఉపాస‌న జంట పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంప‌తులు ఈ వేదిక వ‌ద్ద సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ ఎమోష‌న‌ల్ స్పీచ్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.