Begin typing your search above and press return to search.
వర్షంతో ప్రోగ్రాం క్యాన్సిల్.. ఫ్యాన్స్ కు నిరాశ
By: Tupaki Desk | 5 Jan 2020 9:47 AM GMTసంక్రాంతి సంబరాలు పేరుతో మచిలీపట్నంలో ఒక టీవీషోను నిన్న శనివారం నిర్వహించారు. మచిలీపట్నంలోని ఆంధ్ర జాతీయ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అతిథిగా హాజరు కావాల్సి ఉంది. దీంతో భారీ సంఖ్యలో మహేష్ అభిమానులు వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే మహేష్ బాబు ను చూడాలనుకున్న ఫ్యాన్స్ కు వర్షం కారణంగా నిరాశ తప్పలేదు.
మహేష్ బాబు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగా అనుకున్న సమయానికే వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే అదే సమయంలో జోరుగా వర్షం కురవడంతో కార్యక్రమానికి అంతరాయం కలిగింది. కొంచెం సేపు వేచి చూసిన మహేష్ కార్యక్రమంలో పాల్గొనకుండానే తిరిగివెళ్లారు. అయితే మహేష్ అక్కడి నుంచి వెళ్లిన కొంత సేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో టీవీ షోను కొనసాగించారు. అయితే మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం అభిమానులను నిరాశపరిచింది.
ఈ సందర్భంగా తీసిన మహేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో పసుపు రంగు టీ షర్టు.. చలువకళ్లజోడు ధరించి మహేష్ ఎప్పటిలాగే హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11 న విడుదల కానుంది.