Begin typing your search above and press return to search.
రజనీ అన్నాత్తే మూవీ.. ఈ పద్ధతేం బాగలేదంటున్న ఫ్యాన్స్!
By: Tupaki Desk | 19 July 2021 12:30 PM GMT'రజనీకాంత్..' ఇది కేవలం పేరు మాత్రమే కాదు.. అంతకు మించి! తన మెస్మరైజింగ్ నటనతో దేశంలో కోట్లాది అభిమానులను సంతం చేసుకున్న ఈ సూపర్ స్టార్.. తన క్రేజ్‌ను ఖండాలు దాటించారు. విదేశాల్లోనూ ఆయనకు అభిమాన సంఘాలు ఉన్నాయంటే.. రజనీ మేనియా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ స్థాయిలో ఉన్న అభిమానులను అలరించేందుకు డెబ్బై ఏళ్ల వయసులోనూ రజనీకాంత్ సినిమాలు చేస్తున్నారు. ఇటు మన తెలుగులోనూ రజనీకి ఉన్న అభిమానుల గురించి చెప్పాల్సిన పనిలేదు. రజనీ సినిమాను ఫస్ట్ డే చూసేందుకు పోటీ పడేవాళ్లు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
అయితే.. ఇప్పుడు ఆ అభిమానులు ఓ విషయమై రజనీకాంత్ ను డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఆ డిమాండ్ సోషల్ మీడియాలో నేషనల్ లెవల్లో ట్రెండ్ అయ్యిందంటే.. పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ.. ఆ డిమాండ్ ఏంటీ? ఎందుకోసం ఆ రేంజ్ లో ట్రెండ్ చేయాల్సి వచ్చింది అన్నది చూద్దాం.
రజనీ కాంత్ ఏ సినిమా తీసినా.. డబ్బింగ్ కోటాలో తెలుగులో రిలీజ్ కావాల్సిందే. అయితే.. ఏనాడూ రజనీ సినిమాను డబ్బింగ్ కేటగిరీలో చూడలేదు ఇక్కడి ఫ్యాన్స్. టాలీవుడ్ లో టాప్ హీరోలుగా ఉన్నవారికి తీసిపోని విధంగా.. ఆయన క్రేజ్ ఉందిక్కడ. తెలుగులోనూ సంచలన విజయం సాధించిన ఆయన గత చిత్రాలే అందుకు సాక్ష్యాలు. అయితే.. మాగ్జిమమ్ ఆయన చిత్రాలకు రెండు భాషలకూ కలిసి వచ్చే టైటిల్స్ ను సెలక్ట్ చేసుకుంటారు మేకర్స్. కానీ.. ఈ సారి మాత్రం కేవలం తమిళ్ పేరునే పెట్టారు.
తలైవా అప్ కమింగ్ మూవీ 'అన్నాత్తే'. ఈ టైటిల్ కోలీవుడ్ కు మాత్రమే పరిమితమైనది. మరి, తెలుగు రాష్ట్రాలకు ఇదే టైటిల్ సినిమా వస్తుందా? అన్నది ఫ్యాన్స్ సందేహం. మాగ్జిమమ్ అలా జరగదు. అప్పుడు ఏదో ఒక తెలుగు టైటిల్ ను పెడతారు. ఆ టైటిల్ పెట్టేదే ఎప్పుడూ.. అన్నది ఫ్యాన్స్ ట్విట్టర్ ట్రెండింగ్ కు కారణం. అన్నాత్తే మూవీ షూటింగ్ కంప్లీట్ కావడానికి వచ్చినప్పటికీ.. తెలుగు టైటిల్ ను ఇంకా అనౌన్స్ చేయకపోవడమేంటన్నది వారి బాధ.
#WeWantAnnaattheTeluguTitle అనే హ్యాష్ ట్యాగ్ ను పెట్టి ట్రెండ్ చేశారు. దీనిపై భారీగా ట్వీట్లు, రీ-ట్వీట్లు పడడంతో.. నేషనల్ లెవ్లలో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. మరి, అన్నాత్తే మేకర్స్ ఇకనైనా రజనీ ఫ్యాన్స్ వేదన ఆలకిస్తారో?