Begin typing your search above and press return to search.
ఎఫ్2 : ఫైర్ అండ్ ఫీలింగ్
By: Tupaki Desk | 2 Jan 2019 6:55 AM GMTగోపాల గోపాలలో వెంకటేష్ పవన్ కళ్యాణ్ ల కాంబో తర్వాత కొణిదెల దగ్గుబాటి కలయికలో వస్తున్న ఎఫ్2 మీద రెండు వర్గాల అభిమానులకు మంచి అంచనాలే ఉన్నాయి. కానీ ఇప్పటి దాకా టీజర్-ఆడియో ఓ నాలుగైదు పోస్టర్లు తప్ప ఇంకే అప్ డేట్ లేకపోవడంతో సంక్రాంతి రేస్ చివర్లో వస్తున్న ఈ మూవీ మీద అభిమానులు కొంత టెన్షన్ పడుతున్నారు. సాధారణంగా ప్రమోషన్ విషయంలో చాలా యాక్టివ్ గా ఉండే దిల్ రాజు ఇంత తీవ్రమైన పోటీలో కూడా యధాలాపంగా ఉండటం పట్ల కొంత ఫైర్ అవుతూనే మరికొంత ఫీలవుతున్నారు.
దీనికి కారణాలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని పోటీ ఇప్పుడు నెలకొంది. ముగ్గురు సీనియర్ హీరోలు సై అంటే సై అంటూ సవాల్ విసురుకుంటున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తో బాలకృష్ణ పేటతో రజనీకాంత్ తలపడుతున్నారు. వీళ్లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఇంకా చెప్పాలంటే ఓ రెండాకులు ఎక్కువే అనేలా రామ్ చరణ్ తేజ్ వినయ విధేయ రామతో అసలైన మాస్ ఛాలెంజ్ విసురుతున్నాడు. ఈ నేపథ్యంలో ఎఫ్2 అన్ని వర్గాల ఆడియన్స్ ని తన వైపుకు తిప్పుకోవడం అంత ఈజీ కాదు. పైగా పైన మూడింటిలో ఏ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా 12న వచ్చే ఎఫ్2 ఓపెనింగ్ మీద దాని ప్రభావం ఖచ్చితంగా అయితే ఉంటుంది.
అలాంటప్పుడు ఎఫ్2 మీద ఎక్కువ బజ్ వచ్చేలా టీం కష్టపడాలి. అదే ఆడుతుందన్న ధీమా సరికాదని ట్రేడ్ సైతం అభిప్రాయపడుతోంది. వస్తున్న వాటిలో రెండు ఊర మాస్ సినిమాలు కాగా ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి దాని ప్రత్యేకత వేరు. కాని ఎఫ్2 కాస్త రెగ్యులర్ ఫ్లేవర్ లోనే కనిపిస్తున్న ఎంటర్ టైనర్. పెళ్లి తర్వాత ఇద్దరు హీరోలు పడే అవస్తల గురించి కామెడీగా చూపించబోతున్నారు. మొత్తానికి ప్రమోషన్ వీక్ గా ఉండటం పట్ల ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా బయ్యర్లు సైతం స్పీడ్ పెంచాలని ఫీలవుతున్నారు