Begin typing your search above and press return to search.
రష్మిక చేసిన యాడ్ పై అభిమానుల అసహనం!
By: Tupaki Desk | 1 Oct 2021 3:30 PM GMTతెలుగు .. కన్నడ భాషల్లో రష్మిక స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. తమిళ .. హిందీ భాషల్లో కూడా స్టార్ హీరోయిన్స్ రేసులోకి ఎంటర్ కావాలనే పట్టుదలతో గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్టుగా, క్రేజ్ ఉన్నప్పుడే యాడ్స్ చేసేయలనే నిర్ణయానికి వచ్చేసింది. అంతే ..ఎడా పెడా యాడ్స్ చేసేస్తూ వెళుతోంది. అలా ఉత్సాహంతో ఆమె చేసిన ఒక యాడ్ ఇప్పుడు విమర్శలను తెచ్చిపెడుతోంది. అది జెంట్స్ ధరించే ఒక అండర్ వేర్ యాడ్. విక్కీ కౌశల్ తో కలిసి ఆమె ఆ యాడ్ చేసింది.
అందులో హీరో ధరించిన అండర్ వేర్ ను రష్మీక ఆబగా చూస్తుంది. సృష్టిలోని అందాలను ..అద్భుతాలను చూసినప్పుడు ఎలాంటి హావభావాలు కలుగుతూ ఉంటాయో .. అలాంటి ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. తన కళ్లను తానే నమ్మలేకపోతున్నట్టుగా .. చూపు తిప్పుకోలేక పోతున్నట్టుగా జీవించింది. అండర్ వేర్ ధరించడం వలన వచ్చిన ధైర్యంతో ఒక పదిమంది రౌడీలు కొట్టినట్టు చూపించినా, అండర్ వేర్ ధరించడం వలన హార్స్ రేసులో విన్నర్ గా నిలిచినట్టు చూపించినా సరే అనుకున్నారు.
కానీ ఒక జెంట్ ధరించిన అండర్ వేర్ ను చూసి ఒక లేడీ ఆనందాశ్చర్యలకు లోనుకావడాన్నే జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అండర్ వేర్ చూసి నోరెళ్ల బెట్టే ప్లేస్ లో రష్మీక ఉండటం చూసి తట్టుకోలేకపోతున్నారు.
"పెద్ద సినిమాకి .. పెద్ద సినిమాకి మధ్య చిన్న సినిమా చేసుకో, సినిమాకీ .. సినిమాకి మధ్య కాస్త పేరున్న యాడ్లు చేసుకో ఇలాంటి యాడ్లా చేసేది. ఇకపై ఇలాంటి యాడ్లు చేయడం మానుకో" అంటూ సోషల్ మీడియా ద్వారా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక స్త్రీ వాదుల నుంచి కూడా రష్మీక విమర్శలను ఎదుర్కోవలసి వస్తోంది.
"ఒక అబ్బాయి అండర్ వేర్ చూసి ఇక అమ్మాయి మైకంలో పడుతుందా? మనసు పారేసుకుంటుందా? అతగాడి అండర్ వేర్ కి దాసోహమైనట్టుగా ..ధన్యమైనట్టుగా భావిస్తుందా? అమ్మాయిల గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ ప్రకటన ద్వారా వాళ్లను గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటూ నిలదీస్తున్నారు. మరి రష్మీక పొరపాటు అయిందంటుందో .. తన దృష్టి పారితోషికం పైనే గానీ అతగాడి అండర్ వేర్ పై లేదని చెబుతుందో చూడాలి.
ప్రస్తుతం రష్మిక తెలుగులో 'పుష్ప' సినిమా చేస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్టు పార్టును క్రిస్మస్ కి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాలో ఆమె గిరిజన యువతిగా కనిపించనుంది. ఇక శర్వానంద్ జోడీగా కిషోర్ తిరుమల దర్శకత్వలో ' ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉంది. ఇక కొరటాల .. ఎన్టీఆర్ సినిమా కోసం ఈ సుందరి పేరే వినిపిస్తూ ఉండటం విశేషం.