Begin typing your search above and press return to search.
అమరావతి వద్ద ప్రిన్స్ ఫాన్స్ రచ్చ
By: Tupaki Desk | 21 Feb 2018 12:24 PM GMTపబ్లిక్ ప్లేస్ లో స్టార్ హీరో సినిమా షూటింగ్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫలానా చోట షూటింగ్ జరుగుతుందని తెలియడం ఆలస్యం నిమిషాల్లో దాన్ని సోషల్ మీడియా వేదికగా వైరల్ చేసి పారేసి అందరూ ఒకేచోట గుమికూడేలా చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా మహేష్ బాబు భరత్ అనే నేను షూటింగ్ లో చిన్నపాటి రచ్చ జరగడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లక్డీకాపూల్ లో అమరావతి అనే పాత మూత బడిన థియేటర్ ఒకటి ఉంది. అందులో అప్పుడప్పుడు సినిమా షూటింగులు జరుగుతూనే ఉంటాయి. పబ్లిక్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉండే చోటు కాబట్టి పెద్ద హీరోల సినిమాలు అక్కడ ప్లాన్ చేయరు. కాని భరత్ అనే నేనులో కీలకమైన ఒక ప్రమాణ స్వీకారం ఎపిసోడ్ కోసం ఇది తప్ప వేరే ఆప్షన్ సిటీలో లేకపోవడంతో అక్కడే చేయాలనీ డిసైడ్ అయ్యింది యూనిట్.
లోపల షూటింగ్ జరుగుతూ ఉండగానే సిటీ ఫాన్స్ కు న్యూస్ పాకిపోయింది. ఇంకేముంది వేలాదిగా అమరావతి థియేటర్ దగ్గరకు వచ్చి మహేష్ ని చూడాలని హడావిడి చేసారు. పరిస్థితి గమనించిన మహేష్ పిఏ, పిఆర్ టీం ఇప్పుడు కుదరదని, ఇబ్బంది అవుతుందని సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. ఆ లోపే మహేష్ తన పార్ట్ పూర్తి చేసుకుని మరో ఎంట్రీ నుంచి వెళ్ళిపోయాడు. కాని అభిమానులు మాట వినే స్థితిలో లేకపోవడంతో తమ హీరోను కలుసుకోకపోవడానికి కారణం పిఎ అతని టీం అని భావించి వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేయటం మొదలు పెట్టారు. పక్కనే కలెక్టరేట్ కూడా ఉంది.దీంతో సిచువేషన్ ని కంట్రోల్ లోకి తీసుకురావడానికి సైఫా బాద్ పోలీసులకు చుక్కలు కనిపించాయి.
ఒక్కటి మాత్రం నిజం. హీరోను చూడాలని కోరుకున్న అభిమానులది తప్పు కాదు. కలవాలని ఉన్నా బయటికి వస్తే పరిస్థితి ఇంకా అదుపు తప్పుతుంది కనక చెప్పకుండా వెళ్ళిపోయిన మహేష్ ది కాదు. పబ్లిక్ ప్లేస్ అందులోనూ సిటీలో బిజీ సెంటర్. ప్లాన్ చేసుకున్నప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలే తప్పించి అభిమానులను నిలవరించడం జరిగే పని కాదు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో భరత్ అనే నేను టీం కాళ్ళకు చక్రాలు వేసుకుని మరీ పరిగెత్తుతోంది