Begin typing your search above and press return to search.

డార్లింగ్ కే బొమ్మాళీ షాక్

By:  Tupaki Desk   |   19 Dec 2018 5:20 AM GMT
డార్లింగ్ కే బొమ్మాళీ షాక్
X
అమ్మా బొమ్మాళీ.. అంత ప‌ని చేసేవేంటి? ఉన్న‌ట్టుండి డార్లింగ్ ప‌క్క‌నే ప్ర‌త్య‌క్ష‌మ‌య్యావ్‌.. అభిమానుల‌కు క‌ళ్లు తిప్పుకోనివ్వ‌కుండా చేశావ్.. ముఖ్యంగా ప్ర‌భాస్ అభిమానులకైతే కంటిపై కునుకే క‌రువాయె! ఉన్న‌ట్టుండి ఈ షాక్‌లేంటి? అస‌లు కాఫీ విత్ క‌ర‌ణ్ షోకి బొమ్మాళీ ఎలా వ‌చ్చింది? ప‌్ర‌స్తుతం అభిమానుల్లో ఒక‌టే హాట్ టాపిక్.

గ‌త రెండు వారాలుగా ప్ర‌భాస్ - రాజ‌మౌళి - రానా టీమ్ కాఫీ విత్ క‌ర‌ణ్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొన్నార‌న్న చ‌ర్చ సాగింది కానీ - ఇదే కార్య‌క్ర‌మంలో అనుష్క ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంద‌ని ఊహించ‌లేక‌పోయారు. కానీ ఊహించ‌నిది జ‌రిగితే అదే క‌దా వింత‌! అస‌లింత‌కీ అనుష్క యేనా అది లేదా అనుష్క పంపించిన ఆత్మ‌నా? బొమ్మాళీనా? అన్న‌ది ప‌రిశీలిస్తే షాకిచ్చే నిజ‌మే తెలిసింది.

రాజ‌మౌళి ప్ర‌భాస్ మ‌ధ్య‌లో ప్ర‌త్య‌క్ష‌మైన అనుష్క ఒక మార్ఫింగ్ ఇమేజ్ మాత్ర‌మే. అక్క‌డ‌ క‌ర‌ణ్ జోహార్ బొమ్మ తీసేసి అనుష్క బొమ్మ తో రీప్లేస్ చేశాడు ఎవ‌రో వీరాభిమాని. అస్స‌లు గుర్తుప‌ట్ట‌లేనంత‌గా.. ఇది మార్ఫింగేనా? అని భ్ర‌మించేలా ఉందీ ఫోటో. ఉన్న‌ట్టుండి భూతంలా ప్ర‌త్య‌క్ష‌మైందే.. అంటూ దీంతో వేడిగా చ‌ర్చా మొద‌లైంది. అస‌లే బాలీవుడ్ మీడియా కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టు ``ప్ర‌భాస్ - అనుష్క ఎఫైర్ క‌హానీ`` దొరికింది. ఈ వార్త‌ల‌తో క‌థనాలు వండేస్తోంది. ఈ ఫోటోతో అందుకు మ‌రింత‌ ఆజ్యం పోసిన‌ట్ట‌య్యింది. ఇంత‌కీ ప్ర‌భాస్ అనుష్క‌ను పెళ్లాడుతాడో లేదో తెలియాలంటే.. ఈ ఆది వారం స్టార్ వ‌ర‌ల్డ్‌ లో కాఫీ విత్ క‌ర‌ణ్ స్పెష‌ల్ ఎపిసోడ్ చూడాల్సిందే.